అప్పుడు కూలగొట్టమన్నరు… ఇప్పుడు కూలుస్తరా?

అప్పుడు కూలగొట్టమన్నరు… ఇప్పుడు కూలుస్తరా?

సెక్రటేరియట్ లోని భవనాల కూల్చివేత వ్యవహారం మరోసారి హైకోర్టుకు చేరింది. గతంలో వాటిని కూల్చబోమని హైకోర్టుకు ఇచ్చిన హామీకి విరుద్ధంగా ఇప్పుడు ప్రభుత్వం కూల్చివేతకు శ్రీకారం చుడుతోందని పిటిషనర్‌ తరఫు అడ్వకేట్ ధర్మాసనం దృష్టికి
తెచ్చారు. 2016లో సెక్రటేరియట్ భవనాలను కూల్చి ఎర్రగడ్డలో నిర్మించాలనే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని అప్పట్లోనే సవాల్‌‌ చేస్తూ కాంగ్రెస్​ నేత టి.జీవన్ రెడ్డి పిల్ దాఖలు చేశారు. ఈ పిల్‌‌ విచారణ సందర్భంగా సెక్రటేరియట్ భవనాల్ని కూల్చబోమని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు భరోసా ఇచ్చింది. అయితే.. ఇప్పుడు కూల్చి వేతకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, పిల్ ను అత్యవసరంగా విచారించాలని సోమవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్ఎస్‌ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్‌ షమీమ్‌ అక్తర్‌ తో కూడిన డివిజన్‌‌ బెం చ్‌ కు పిటిషనర్​ జీవన్ రెడ్డి తరఫున సీనియర్​ అడ్వకేట్ సరసాని సత్యంరెడ్డి నివేదించారు. దీనిపై ఈ నెల 28న విచారిస్తామని బెంచ్​ స్పష్టం చేసింది.

అప్పట్లో కూల్చబోమన్న సర్కార్
వాస్తు కోసం సెక్రటేరియెట్ ను కూల్చివేసి, ఎర్రగడ్డలో కొత్త సెక్రటేరియెట్ ను కట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, ఇది చెల్లదని పేర్కొంటూ 2016లో జీవన్ రెడ్డితోపాటు అడ్వకేట్ టి.రజనీకాంత్‌ రెడ్డి, ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నన్స్‌‌ కార్యదర్శి పద్మనాభరెడ్డి వేర్వేరుగా హైకోర్టులో పిల్స్​ దాఖలు చేశారు. అప్పుడు వీటిని విచా రించిన ధర్మాసనం ఎదుట జీవన్‌‌రెడ్డి తరఫున అడ్వకేట్ సత్యం రెడ్డి వాదించారు.

‘‘ఇప్పుడున్న సచివాలయంలోని భవనాలు 1985 తర్వాత నిర్మించినవి కూడా ఉన్నాయి. ఆ తర్వాత కూడా కొత్త భవనాల నిర్మాణం జరిగింది. వందేళ్ల వరకూ వినియోగించేందుకు యోగ్యమైన రెండు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం లో ఉన్న సువిశాలమైన భవనాల్ని కూల్చివేసి మరో చోట నిర్మాణాలు చేయడం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమే. వీటిని వాస్తు దోషాల పేరుతో కూల్చేడం దారుణం. చట్టసభ సభ్యు లకు తెలియకుం డానే ఇంతటి ఖరీదైన, విలువైన భవనాల్ని కూల్చివేయడం చట్ట వ్యతిరేకంగా ప్రకటించాలి” అని కోరారు. రూ.500 కోట్ల వ్యయంతో కొత్త బిల్డింగ్స్‌‌లు నిర్మించాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. దీనిపై అప్పటి రాష్ట్ర అడ్వొకేట్‌‌ జనరల్‌‌ కె.రామకృష్ణారెడ్డి .. సచివాలయంలోని భవనాలు అగ్నిప్రమాద నివారణకు యోగ్యం గా లేవని, రక్షణ యోగ్యం గా అసలే లేవని, ఏదైనా అగ్నిప్రమాదం జరిగితే ఫైరింజన్‌‌ వెళ్లేందుకు భవనాల చుట్టూ తిరిగేందుకు దారి లేదని హైకోర్టు దృష్టికి తెచ్చారు. అన్నిసౌకర్యాలతో భద్రత ఉండే విధంగా కొత్త భవనాలు నిర్మించాలని కేబినెట్ నిర్ణయించిందని, కర్నాటక, తమిళనాడు సచివాలయాల నిర్మాణాలను అడ్డుకోవాలని ఆ రాష్ట్రాల హైకోర్టుల్లో పిల్స్‌‌ దాఖలైతే వాటిపై అక్కడి ధర్మాసనాలు జోక్యం చేసుకోలేదని పేర్కొ న్నారు. ఇక్కడి పిల్‌‌ను కూడా కొట్టేయాలని వాదించారు. నాడు కేసు పది రోజులకు వాయిదా పడగా.. ఈలోగా సచివాలయ భవనాల్ని కూల్చబోమని ప్రభుత్వం తరఫున అప్పటి అడ్వకేట్ జనరల్ హైకోర్టు తెలిపారు.
ఈ హామీని హైకోర్టు నమోదు కూడా చేసింది.