నిందితుడిని కఠినంగా శిక్షించాలి: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

నిందితుడిని కఠినంగా శిక్షించాలి: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

నర్సింగాపూర్ గ్రామానికి చెందిన రైతు జలపతిరెడ్డి తన ఇద్దరు కూతుళ్లతో బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటనలో.. మృతుడి సూసైడ్ నోట్ ను మరణ వాంగ్మూలంగా పరిగణించాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. ఇవాళ ఆయన తన నివాసంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ధరూర్ గ్రామానికి చెందిన అధికార పార్టీ నాయకుడు అడ్వకేట్ అయిన దామోదర్ రావుపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలన్నారు. 1997 లో టీఆర్ నగర్ లాండ్ అక్యువేషన్ లో భూములు కోల్పోయిన వారందరూ అడ్వకేట్ ను ఆశ్రయించారని.. కానీ అడ్వకేట్ నిధుల విడుదలలో జాప్యం వల్లనే జలపతి రెడ్డి తన ఇద్దరు కూతుర్లతో సహా ఆత్మహత్యకు పాల్పడ్డాడని తెలిపారు.

జలపతి రెడ్డి రాసిన సూసైడ్ నోట్, సెల్ఫీ వీడియో క్లిప్పింగ్ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని కఠినంగా శిక్షించాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇప్పటివరకు నిందితున్ని అదుపులోకి తీసుకోకుండా పోలీసులు ఎందుకు జాప్యం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం బాధిత కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఎక్స్ గ్రెషియా చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.