
తెలంగాణ రాష్ట్ర ప్రగతి అంటే 2 లక్షల 40 వేల కోట్ల అప్పు అని అన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. అధికార పార్టీ ప్రచార ఆర్భాటాలకు పోవడం వల్లే మిడ్ మానేరు నిర్మాణం మూడేళ్లు ఆలస్యం అయ్యిందన్నారు. సాంకేతిక పరిజ్ఞానం లోపంతోనే కట్ట తెగిందన్నారు. కాళేశ్వరం ద్వారా 70 -80 లక్షల ఆయకట్టు సాగు నీరండుతుందని సీఎం చెప్పారు. అంత సాగవలంటే వాటి కోసం 800 టీఎంసీలు కావాలన్నారు. ప్రస్తుత నీటితో 18 లక్షల ఎకరాలే సాగవుతుందన్నారు. ఇంత వరకు అదనంగా ఒక్క ఎకరాకు కూడా నీరు ఇవ్వలేదన్నారు. ఇప్పటి వరకు అప్పర్ మానేరు ఎందుకు నింపలేదన్నారు. ప్రతిపక్షాలకు విషయ పరిజ్ఞానం లేదని సీఎం విమర్శించడం సరి కాదన్నారు.