12 గంటలకు మించి కరెంట్ ఇస్తలే.. కేసీఆర్​పై కోమటిరెడ్డి ఫైర్​

12 గంటలకు మించి కరెంట్ ఇస్తలే..  కేసీఆర్​పై కోమటిరెడ్డి ఫైర్​
  • 12 గంటలకు మించి కరెంట్ ఇస్తలే
  • కేసీఆర్​పై కోమటిరెడ్డి ఫైర్​

హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో  కేసీఆర్​ ప్రభుత్వం 12 గంటలకు మించి కరెంట్​ఇవ్వడం లేదని కాంగ్రెస్​ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి ఆరోపించారు. రాబోయే రోజుల్లో మరిన్ని కోతలుంటాయని..రైతులకు ఇబ్బందులు తప్పవని గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కరెంట్ కోతలపై ఇప్పటికీ తనకు ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయన్నారు. నల్గొండ మండలం అప్పాజీపేటలో వారం నుంచి కనీసం ఆరు గంటలు కూడా కరెంట్ ​రావడం లేదని కోమటిరెడ్డి తెలిపారు.  24 గంటల కరెంట్​ లేకపోతే.. పక్క రాష్ట్రాల నుంచైనా తెప్పించి ఇవ్వాలని సీఎం కేసీఆర్​కు సూచించారు. 

రాష్ట్ర సర్కారు మాటలను నమ్మి రైతులు నాట్లు వేసుకున్నారని చెప్పారు. ప్రభుత్వం ఇస్తున్న రైతుబంధు సొమ్ములు రైతు పెట్టుబడికి తెచ్చిన డబ్బు, దాని వడ్డీలకూ సరిపోవడం లేదని వివరించారు. కనీసం కరెంటైనా పూర్తి స్థాయిలో ఇచ్చి రైతులు నష్టపోకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. మూడు నెలల తర్వాత ఎలాగూ కాంగ్రెస్​ గవర్నమెంటే వస్తుందని, అప్పటివరకైనా 24 గంటల కరెంట్​ఇవ్వాలని కేసీఆర్​ను కోమటిరెడ్డి డిమాండ్​ చేశారు.