హరీష్, కవిత యూనియన్లలో లేరా..?: రేవంత్ రెడ్డి

హరీష్, కవిత యూనియన్లలో లేరా..?: రేవంత్ రెడ్డి

హుజూర్ నగర్ ని నియోజకవర్గంలో అభివృద్ధి పేరుతో గెలిచి… దానిని సమ్మెకి ఎలా ముడిపెడుతారన్నారు ఎంపీ రేవంత్ రెడ్డి. హుజూర్ నగర్ అభివృద్ధి అంటున్న కేసీఆర్.. మరి గతంలో కొడంగల్ లో కూడా అలాగే చెప్పారని.. ఇప్పటి వరకు ఎంత నిధులు జారీ చేశారో చెప్పాలన్నారు. కేటీఆర్ ఎప్పుడు స్వయం ప్రకాశిత లీడర్ కాదని.. నేను అలా కాదన్నారు రేవంత్. రామారావు ఎంత చేసిన ఓడించారని.. అసలు తెలంగాణ ప్రజలు కోరుకున్నది స్వేచ్ఛ.. కానీ తిరుగుబాటు కాదు. సంక్షేమం కోసం స్వేచ్ఛను వదులుకొరన్నారు. కొమురంభీం, చాకలి ఐలమ్మ, రాంకి గోండు, సర్వాయి పాపన్న వంటి వారు కూడా పోరాడింది స్వేచ్ఛ కోసమేనని తెలిపారు.

ఆర్టీసీలో హరీష్ రావు, సింగరేణిలో కవిత గెలిచిన్నప్పుడు యూనియన్లు ఎందుకు రద్దు చేయలేదని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. ఈ రాష్ట్రంలో వెల్ఫేర్ ఏనాడు ఆగలేదని.. కాకపోతే ఎప్పటికప్పుడు ఉన్న బడ్జెట్ ని బట్టి సంక్షేమం అమలు చేశారన్నారు. శ్రీశైలం 1000 కోట్లు, 130 కోట్లతో నాగార్జున సాగర్ నిర్మాణం పూర్తి అయ్యిందని తెలిపిన రేవంత్.. 2 లక్షల కోట్లు పెట్టినా కాళేశ్వరం పూర్తి కాలేదన్నారు. కేసీఆర్ కి సందేశం ఇవ్వడానికే… కవితను ఓడగొట్టారు. అయినా అర్ధం చెసుకోలేదని తెలిపారు రేవంత్ రెడ్డి.