పార్లమెంట్ గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ ఎంపీల ధర్నా

పార్లమెంట్ గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ ఎంపీల ధర్నా

పార్లమెంట్ గాంధీ విగ్రహం వద్ద నిరసనకు దిగారు కాంగ్రెస్ ఎంపీలు. పెరిగిన వంట గ్యాస్ పెట్రోల్ డీజిల్ ధరలపై ఆందోళనకు దిగారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ తమ నిరసన తెలిపారు. వంట్ గ్యాస్ వెయ్యి రూపాయలు చేశారు.. పెట్రోల్ డీజిల్ రేట్లు కూడా పెంచేశారంటూ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ప్రజల్ని ప్రభుత్వం దోచుకోవడం ఆపాలంటూ డిమాండ్ చేశారు. 

ఐదురాష్ట్రాల ఎన్నికల తర్వాత కేంద్రం ఒక్కసారిగా పెట్రోల్ డీజిల్, ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరల్ని అమాంతం పెంచేసింది. వంట గ్యాస్ ధర వెయ్యి దాటింది. దీంతో సామాన్యుడు నెత్తిన గుదిబండ పడినట్లైంది. మరోవైపు దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల బాదుడు కొనసాగుతోంది. వరసగా రెండో రోజులు చమురు ధరలు పెరిగాయి. లీటర్ పెట్రోల్ పై 90 పైసలు, డీజిల్ పై 87 పైసలు పెరిగింది. దీంతో లీటర్ పెట్రోల్ ధర 110 రూపాయలకు చేరింది. డీజిల్ 96 రూపాయల 36 పైసలకు చేరింది. ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత మళ్లీ పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయి.