
Telangana Congress MP Candidates First List 25024: కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించింది. మొత్తం 39 మంది లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లను వెల్లడించింది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వయనాడ్ నుంచి పోటీ చేయనున్నట్లు ప్రకటించింది. ఇక తెలంగాణ నుంచి పోటీ చేసే నలుగురు అభ్యర్థుల పేర్లను ఖరారు చేసింది కాంగ్రెస్ అధిష్టానం.
నల్లగొండ నుంచి కుందూరు జానారెడ్డి కుమారుడు రఘవీర్ రెడ్డి, మహబూబ్ నగర్ నుంచి వంశీచంద్ రెడ్డి, జహీరాబాద్ నుంచి సురేష్ షెట్కర్ , మహబూబాబాద్ నుంచి బలరామ్ నాయక్ పేర్లను ఖరారు చేసింది కాంగ్రెస్ అధిష్టానం.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులు
- సురేష్ షెట్కర్- జహీరాబాద్
- రఘువీర్ రెడ్డి - నల్లగొండ
- బలరామ్ నాయక్- మహబూబాబాద్
- వంశీచంద్ రెడ్డి -మహబూబ్ నగర్