
కాంగ్రెస్ ఏడాది పాలన పూర్తైన సందర్భంగా హైదరాబాద్ యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు మోత రోహిత్ ఆధ్వర్యంలో అంబర్‌పేట తిలక్‌నగర్ నుంచి నెక్లెస్ రోడ్ వరకు 1000 బైక్‌లతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం అక్కడి ఇందిరా గాంధీ విగ్రహం సర్కిల్ వద్ద ‘తెలంగాణ రైసింగ్’ అనే టైటిల్‌తో సీఎం రేవంత్ రెడ్డి ఉన్న భారీ బ్యానర్ ప్రదర్శించారు.