Prabhas: కన్నీళ్ల వెనుక కమిట్‌మెంట్.. డైరెక్టర్ మారుతికి భరోసా ఇచ్చిన ప్రభాస్.. డార్లింగ్ సపోర్ట్పై నెటిజన్ల ప్రశంసలు

Prabhas: కన్నీళ్ల వెనుక కమిట్‌మెంట్.. డైరెక్టర్ మారుతికి భరోసా ఇచ్చిన ప్రభాస్.. డార్లింగ్ సపోర్ట్పై నెటిజన్ల ప్రశంసలు

టాలీవుడ్‌లో భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న పాన్‌ ఇండియా మూవీ ‘ది రాజాసాబ్’. ప్రభాస్ ఫస్ట్ టైం హార్రర్ బ్యాక్ డ్రాప్ లో వస్తుండటంతో అంచనాలు మరింత పెరిగాయి. ఈ క్రమంలో ఫ్యాన్స్ ఊహలను ఏ మాత్రం డిస్సప్పాయింట్ చేయకుండా డైరెక్టర్ మారుతి సినిమాను రూపొందించారు. దాదాపు 3 ఏళ్లుగా సినిమా కోసం కష్టపడి అద్భుతంగా తీర్చిదిద్దాడు. ఈ క్రమంలోనే డిసెంబర్ 27న రాత్రి జరిగిన ప్రీ రిలీజ్ ఫంక్షన్లో ఎమోషనల్ అయ్యారు.

“ఈ సినిమా కోసం నా శక్తి మొత్తం పెట్టాను. ఎవరినీ నిరాశపర్చకూడదనే బాధ్యత నాపై చాలా ఉంది. దర్శకుడిగా ఎన్నో హిట్ సినిమాలు ఇచ్చినప్పటికీ, ఈ స్థాయిలో ఒత్తిడి ఎదురవడం ఇదే తొలిసారి. ” అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. మారుతి కన్నీళ్లు చూసిన ప్రభాస్ వెంటనే ఆయన దగ్గరకు వెళ్లి ధైర్యం చెప్పారు. “మీ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. మీరు బెస్ట్ ఇస్తారు. టెన్షన్ అవసరం లేదు డార్లింగ్ ” అంటూ మారుతిని ఓదార్చారని టాక్. ఇప్పుడు ఈ వీడియో అందరి మనసులను తాకుతోంది. దర్శకుడిపై ప్రభాస్ చూపించిన ఈ మానవీయత, సపోర్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రశంసలు పొందుతోంది.

డైరెక్టర్ మారుతి కన్నీళ్ల వెనుక ఉన్నది బలహీనత కాదని, ‘రాజాసాబ్’పై ఉన్న ప్యాషన్, కమిట్‌మెంట్ అని టాలీవుడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.ఎందుకంటే, భారీ బడ్జెట్, పాన్‌ ఇండియా స్థాయి అంచనాలు, అభిమానుల ఆశలు.. ఈ అన్నిటి ఒత్తిడి మారుతిపై తీవ్రంగా పడినట్లు సమాచారం. అందువల్ల మారుతి ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇకపోతే, రాజాసాబ్ రీ రిలీజ్ ట్రైలర్ రేపు విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది. 

ప్రభాస్ ద్విపాత్రాభినయం..

ఈ సినిమాలో ప్రభాస్ ద్విపాత్రాభినయం (Dual Role) చేస్తున్నారు. ఒకటి స్టైలిష్‌గా ఉండే యువకుడి పాత్ర కాగా, మరొకటి భయంకరమైన గెటప్‌లో ఉండే 'రాజా సాబ్' పాత్ర అని తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్,  పోస్టర్లలో ప్రభాస్ వింటేజ్ లుక్ చూసి అభిమానులు మురిసిపోతున్నారు. మరీ ముఖ్యంగా ప్రభాస్ బాడీ లాంగ్వేజ్, కామెడీ టైమింగ్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ కానున్నాయి. ఈ మూవీలో  మాళవిక మోహనన్, రిద్ది కుమార్. నటిస్తున్నారు. సంజయ్ దత్, బొమన్ ఇరానీ, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్ వంటి వారు కీలవ పాత్రను పోషిస్తున్నారు.

►ALSO READ | OTT Movie: పిచ్చి ప్రేమ.. హార్ట్‌బ్రేక్ కథతో.. ఓటీటీలో దూసుకెళ్తోన్న కొత్త సినిమా

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రం తెలుగు, తమిళ, హిందీ, కన్నడ , మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. బాహుబలి తర్వాత మళ్ళీ ప్రభాస్‌ను ఒక పూర్తిస్థాయి ఎంటర్‌టైనింగ్ పాత్రలో చూడబోతుండటంతో సంక్రాంతి రేసులో 'రాజా సాబ్' విజయం ఖాయమని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.