హోం ఐసోలేషన్ లో సోనియా

హోం ఐసోలేషన్ లో సోనియా

కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ మరోసారి కరోనా బారిన పడ్డారు. శనివారం కోవిడ్ 19 పాజిటివ్ లక్షణాలు కనబడడంతో హోం ఐసోలేషన్ లో ఉన్నారని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ వెల్లడించారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ చికిత్స తీసుకుంటున్నారని తెలిపారు. ఆమె త్వరగా కోలుకోవాలని..మంచి ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటున్నట్లు కాంగ్రెస్ ట్వీట్ చేసింది. 

జూన్ నెలలో కరోనా వైరస్ కోసం పాజిటివ్ లక్షణాలు కనబడడంతో హోం ఐసోలేషన్ ఉన్నారు. ఈ సమయంలో మనీలాండరింగ్ కేసులో విచారణకు హాజరు కావాలని ఈడీ సమన్లు జారీ చేసింది. తనకు కరోనా సోకిందని.. హాజరయ్యేందుకు తగిన సమయం కావాలని సోనియా అభ్యర్థనకు ఈడీ సమ్మతించింది. ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆసుపత్రిలో సోనియా చేరారు. కరోనాతో కోలుకున్న అనంతరం ఈడీ ఎదుట సోనియా హాజరయ్యారు. కమ్యూనికేషన్ డిపార్ట్ మెంట్ హెడ్ పవన్ ఖేరా, పార్టీ ఎంపీ అభిషేక్ మను సింఘ్వీ, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లిఖార్జున ఖర్గేతో సహా పలువురు కాంగ్రెస్ నేతలు కోవిడ్ -19 బారిన పడ్డారు.