ఫస్ట్ లిస్ట్ రిలీజ్: లోక్ సభ బరిలో కాంగ్రెస్ అభ్యర్థులు

ఫస్ట్ లిస్ట్ రిలీజ్: లోక్ సభ బరిలో కాంగ్రెస్ అభ్యర్థులు

మహాకూటమి నాయకురాలిగా ఓవైపు పొత్తుల చర్చలు కొనసాగిస్తూనే కాంగ్రెస్ పార్టీ సొంత అభ్యర్థుల్ని ప్రకటించే ప్రక్రియను షురూ చేసింది. 2019 లోక్ సభ ఎన్నికల్లో పోటీచేయబోయే అభ్యర్థుల తొలి జాబితాను ఏఐసీసీ గురువారం విడుదల చేసింది. పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ(సీఈసీ) ఆమోదించిన జాబితాలో ఉత్తరప్రదేశ్​, గుజరాత్​ రాష్ట్రాల్లోని 15 స్థానాలకు క్యాండేట్లను ఖరారు చేశారు. ఉత్తరప్రదేశ్​కు సంబంధించి11 మంది అభ్యర్థుల్ని, గుజరాత్​లో నలుగురి పేర్లను తొలి విడతగా ప్రకటించారు. యూపీ ఫస్ట్​ లిస్టులో సోనియా గాంధీ(రాయ్​బరేలీ), రాహుల్(అమేథీ), సల్మాన్ ఖుర్షీద్ (ఫరూఖాబాద్ ), జితిన్ ప్రసాద (ధౌరాహ్ర) తదితర ప్రముఖులున్నారు. ఈసారి రాయ్​బరేలీ నుంచి ప్రియాంక గాంధీ బరిలోకి దిగుతారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగినా, ఎప్పటిలాగే సోని యాకే ఖరారైంది. ఇక గుజరాత్​కు సంబంధించి అహ్మదాబాద్ వెస్ట్​(ఎస్సీ), ఆనంద్ , వడోదరా, చోటా ఉదయ్​పూర్ (ఎస్టీ) స్థానాల్లో అభ్యర్థుల్ని ఒకే చేశారు.

అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్​లో ఒంటరిగా బరిలోకి దిగుతున్న కాంగ్రెస్ , అభ్యర్థుల ఎంపికలో వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ఫస్ట్​ లిస్ట్​లోనే ముగ్గురు ముస్లింలకు టికెట్లిచ్చి మైనారిటీ వర్గాన్ని ఆకర్షించే ప్రయత్నం చేసింది. గత ఎన్నికల్లో యూపీలోని 80 స్థానాలకుగాను 78 చోట్ల పోటీచేసిన బీజేపీ ఒక్క ముస్లింకు కూడా టికెట్ ఇవ్వకుండా 71 సీట్లను కైవసంచేసుకున్న సంగతి తెలిసిందే. 12న CWC భేటీ లోక్ సభ ఎన్నికలపై చర్చించేందుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(CWC) 12న అహ్మదాబాద్ లో భేటీ కానుంది. పార్టీ జనరల్ సెక్రటరీ హోదాలో ప్రియాంక గాంధీ తొలిసారి ఈ మీటింగ్ లో పాల్గొంటారు. మీటింగ్ ఈ నెల 8నే జరగాల్సిఉండగా, పుల్వామా అటాక్ నేపథ్యంలో వాయిదా పడింది.