అబ్ హోగా ‘న్యాయ్’ : ప్రమోషన్ సాంగ్ రిలీజ్

అబ్ హోగా ‘న్యాయ్’ : ప్రమోషన్ సాంగ్ రిలీజ్

సార్వత్రిక ఎన్నికల ప్రచారాన్ని కాంగ్రెస్ పార్టీ స్పీడప్ చేసింది. తమ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రధాన అస్త్రంగా భావిస్తున్న న్యాయ్(NYAY) స్కీమ్ ను విస్తృతంగా జనంలోకి తీసుకెళ్లాలని నిర్ణయించింది. ‘అబ్ హోగా న్యాయ్’ స్లోగన్ తో న్యాయ్ పథకాన్ని ప్రచారం చేస్తోంది.

దేశంలో 20శాతం వరకు ఉన్న నిరుపేదలకు ఆర్థికంగా న్యాయం చేయాలన్నదే తమ లక్ష్యమని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. పేదలకు నెలకు రూ.6వేల చొప్పున ఏడాదికి రూ.72వేలు అందించే ఉద్దేశంతో న్యాయ్ స్కీమ్ ను రూపొందించింది. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే న్యాయ్ పథకం అమలు చేస్తామనీ… జన జీవితంలో ఈ స్కీమ్ ఎలాంటి మార్పులు తీసుకొస్తుందో వివరించే థీమ్ తో ఈ పాటను రూపొందించారు.

“నేను ఓటర్ ను.. రైతును.. నేను నిరుద్యోగిని.. జవాన్ ను. నేను ఎవరికీ అమ్ముడుపోను… ఐనా నేను హిందూస్తానీని. నేను ఆగను.. నేను దేనికీ లొంగను.. అబద్దాల దారిలో నడిచి… నగరాల పేర్లు మార్చి.. నోట్ల రద్దుచేసి.. మళ్లీ మిమ్మల్నే ఎంచుకోమని చెబుతున్నావ్. మేం చెప్పేది ఇపుడు విను. మేం మోసపోం. అందరికీ న్యాయం చేేసే  కాంగ్రెస్ ప్రభుత్వం తెస్తోంది. రైతులు, నిరుద్యోగులు, పేదలు అందరికీ న్యాయం చేసే ప్రభుత్వం వస్తోంది. న్యాయ్ లో ఉన్నతి ఉంది. న్యాయ్ తో ప్రగతి జరుగుతుంది. రైతులు తెల్సుకున్నారు. ప్రతి జవాన్ తెల్సుకున్నాడు. న్యాయ్ ఉద్యోగాలు తెస్తుంది.  హిందూ ముస్లిం భేదాలు పోయి.. ప్రేమ తెస్తుంది. అన్యాయం నిర్మూలించేందుకు మేం ఓ తుఫాను రేపబోతున్నాం” అంటూ సాగే ఈ పాట… ఆకట్టుకునేలా రూపొందించారు. అన్ని వర్గాల ప్రజలను పాటలో చూపించారు.