
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ రాజ్యసభ సీటు కోసం మిత్రపక్షమైన డీఎంకే సాయాన్ని కాంగ్రెస్ కోరుతోంది. మన్మోహన్ రాజ్యసభ పదవీకాలం ఈమధ్యనే ముగిసింది. అస్సాం నుంచి ఆయన రాజ్యసభకు గతంలో ఎన్నికయ్యారు. ఈసారి మళ్లీ అక్కడి నుంచి ఎన్నికయ్యేందుకు కాంగ్రెస్‌కు సరిపడినంత బలం లేదు. దీంతో ఈసారి తమిళనాడు నుంచి మాజీ ప్రధానికి అవకాశం కల్పించాలని కాంగ్రెస్ హైకమాండ్ డీఎంకేను కోరినట్టు వార్తలొచ్చాయి. వచ్చేనెల తమిళనాడు నుంచి ఆరు రాజ్యసభ సీట్లకు ఎన్నికలు జరగనున్నందున…తమకు ఓ సీటు ఇవ్వాలని డీఎంకే ప్రెసిడెంట్‌కు కాంగ్రెస్ సీనియర్ లీడర్ అహ్మద్‌పటేల్ కోరినట్టు తెలిసింది. మిత్రపక్షమైన కాంగ్రెస్‌కు ఒక సీటు కేటాయించే విషయంపై స్టాలిన్ ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదంటున్నారు. ఒక సీటును ఎండీఎంకే జనరల్ సెక్రటరీ వైకోకు, మరో రెండు సీట్లను సొంతపార్టీ నాయకులకు ఇవ్వాలని డీఎంకే ఇప్పటికే నిర్ణయించినట్టు ఆపార్టీ నేతలు చెబుతున్నారు. ఈమధ్య జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించడంతో డీఎంకే మూడు సీట్లు గెలుచుకోనుంది.