సెప్టెంబర్ 7 నుంచి కాంగ్రెస్ భారత్ జోడో యాత్ర

సెప్టెంబర్ 7 నుంచి కాంగ్రెస్ భారత్ జోడో యాత్ర

సెప్టెంబర్ 7 నుంచి కాంగ్రెస్ మరోసారి కాంగ్రెస్ జోడో యాత్ర నిర్వహించునుంది. రాహుల్ గాంధీ తలపెట్టిన పాదయాత్ర ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా అన్ని జిల్లాలో కాంగ్రెస్ భారత్ జోడో యాత్రను నిర్వహించనుంది. రెండో దశ భారత్ జోడో యాత్ర.. గుజరాత్ నుంచి మేఘాలయ వరకు ఉంటుందని మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే తెలిపారు. 

భారత్ జోడ యాత్ర గతేడాది సెప్టెంబర్ లో కన్యాకుమారి నుంచి ప్రారంభమై 130 రోజుల  వ్యవధిలో కాశ్మీర్ లో ముగిసిన విషయం తెలిసిందే. బీజేపీ కుతంత్రాలను ఎదుర్కొనేందుకు పార్టీ కార్యకర్తలకు, అధికారాన్ని నిలుపుకోవడానికి కొత్త శక్తిని ఇచ్చిందని అన్నారు. రాజకీయ విశ్లేషకులు,సీనియర్ జర్నలిస్టుల అభిప్రాయం ప్రకారం..2024లో  లోక్ సభ ఎన్నికల్లో అంతకంటే ముందు రాష్ట్ర ఎన్నికలలో ప్రయోజనాలను పొందాలనే ఉద్దేశ్యంతో రాహుల్ రెండో సారి భారత్ జోడో యాత్రను ప్రారంభించనున్నట్లు తెలిపారు.