
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో 15 ఎంపీ స్థానాల్లో కాంగ్రెస్‌ను గెలిపిస్తామని యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనా రెడ్డి అన్నారు. శనివారం గాంధీ భవన్ లో తెలంగాణ యూత్ కాంగ్రెస్ స్టేట్ ఎక్సెక్టివ్ మీటింగ్ జరిగింది. ఈ సమావేశంలో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో యూత్ కాంగ్రెస్ ప్రణాళికపై, డోర్ 2 డోర్ ప్రచారంపై చర్చించారు.
జై జవాన్ క్యాంపెయిన్‌ను ప్రారంభించారు. త్వరలో యూత్ కాంగ్రెస్ గ్రామ కమిటీలను వేస్తామని ప్రకటించారు. సమావేశానికి ముఖ్య అధితిగా ఏఐసీసీ జాయింట్ సెక్రటరీ, యూత్ కాంగ్రెస్ జాతీయ ఇన్ చార్జ్ కృష్ణ అల్లవారు, తెలంగాణ యూత్ కాంగ్రెస్ ఇన్ చార్జ్ లు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా అధ్యక్షులు పాల్గొన్నారు.