2024 సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా కాంగ్రెస్ చర్చ

2024 సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా కాంగ్రెస్ చర్చ

వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీతో భేటీ అయ్యారు. 2024 సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా ఈ చర్చ జరిగింది. అంతే కాకుండా ప్రశాంత్ కిషోర్ 2024 సార్వత్రిక ఎన్నినకలపైనే సుదీర్ఘమైన ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. అలాగే కాంగ్రెస్ 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎలా ముందుకు వెళ్లాలన్న దానిపై ఓ రోడ్ మ్యాప్ కూడా ఇచ్చారు. ఈ సమావేశంలో రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, అంబికా సోనీ, దిగ్విజయ్ సింగ్, మల్లికార్జున ఖర్గే పాల్గొన్నారు. సార్వత్రిక ఎన్నికలపై వీరందరూ గ్రూప్ డిస్కర్షన్ కూడా చేశారు. తర్వాత నేతల అభిప్రాయాలను తీసుకున్నారు. ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన ప్రజెంటేషన్ పై  సోనియా గాంధీ వారంలో నిర్ణయం తీసుకుంటారని కేసీ వేణుగోపాల్ తెలిపారు. కాంగ్రెస్ ఇప్పటికే బలంగా ఉన్న రాష్ట్రాలపై ఫోకస్ పెట్టనుంది. ముఖ్యంగా 370 లోక్ సభ స్థానాలపై దృష్టి పెట్టాలని ప్రశాంత్ కిషోర్ సూచించినట్లు తెలుస్తోంది. యూపీ, బీహార్, ఒడిశా, తమిళనాడు, వెస్ట్ బెంగాల్, మహారాష్ట్రలో మిత్రపక్షాలతో బరిలోకి దిగాలని సూచించారు. ఈ ప్రజెంటేన్ ను రాహుల్ అంగీకరించినట్లు తెలుస్తోంది. ఇక గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ లో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపైనా ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ నేతలతో చర్చించారని పార్టీ వర్గాలు తెలిపాయి.