నేను ఉన్నాను.. నేను విన్నాను.. రాధాకిషన్ వాంగ్మూలంపై కేసీఆర్‌‌‌‌‌‌‌‌ను ఉద్దేశించి కాంగ్రెస్‌‌‌‌ ట్వీట్

నేను ఉన్నాను.. నేను విన్నాను.. రాధాకిషన్ వాంగ్మూలంపై కేసీఆర్‌‌‌‌‌‌‌‌ను ఉద్దేశించి కాంగ్రెస్‌‌‌‌ ట్వీట్

హైదరాబాద్, వెలుగు: ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్ఐబీ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు ఇచ్చిన వాంగ్మూలం రిపోర్టుపై పీసీసీ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఆసక్తికర పోస్టు చేసింది. ‘నేను ఉన్నాను.. నేను విన్నాను’అనే ట్యాగ్ లైన్‌‌‌‌తో మంగళవారం ఈ ట్వీట్ చేసింది. ‘‘ఓటమిని ముందే పసిగట్టి.. గెలుపు కోసం అడ్డదారులు తొక్కిన బీఆర్ఎస్ అధినేత. అధికారం అడ్డం పెట్టుకొని ఫోన్ ట్యాపింగ్ కథ నడిపిన కల్వకుంట్ల గ్యాంగ్. అన్ని ఆయన కనుసన్నల్లోనే జరిగాయని రాధాకిషన్ రావు వాంగ్మూలం. కారెవరు ట్యాపింగ్‌‌‌‌కు అనర్హం అని విపక్ష నేతలవే కాకుండా.. సొంత పార్టీ నేతల ఫోన్లను కూడా కేసీఆర్ ట్యాపింగ్ చేయించిండు”అంటూ కాంగ్రెస్‌‌‌‌ ట్వీట్‌‌‌‌ చేసింది.