బీఆర్‌‌‌‌ఎస్‌‌లో మిగిలేది 2 బీహెచ్‌‌కే మాత్రమే!

బీఆర్‌‌‌‌ఎస్‌‌లో మిగిలేది 2 బీహెచ్‌‌కే మాత్రమే!

హైదరాబాద్, వెలుగు :  బీఆర్‌‌‌‌ఎస్‌‌ పార్టీలో చివరకు మిగిలేది 2 బీహెచ్‌‌కే మాత్రమేనని కాంగ్రెస్ ఎద్దేవా చేసింది. 2బీ అంటే బాపు, బేటా, హెచ్ అంటే హరీశ్‌‌రావు, కే అంటే కవిత అంటూ సోమవారం ట్విట్టర్‌‌‌‌లో పేర్కొంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి బీఆర్‌‌‌‌ఎస్‌‌ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మరికొందరు కీలక నేతలు ఆ పార్టీకి రాజీనామా చేస్తూ కాంగ్రెస్, బీజేపీలో చేరుతున్నారు. ఎంపీ ఎన్నికలకు ముందే మరికొంత మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పార్టీ మారుతారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.