కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ది డ్రామాల రాజకీయం!..మాక్ పార్లమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తో రాజ్యాంగ వ్యవస్థలపై దాడి: రాంచందర్రావు

కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ది డ్రామాల రాజకీయం!..మాక్ పార్లమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తో రాజ్యాంగ వ్యవస్థలపై దాడి: రాంచందర్రావు
  • పునరావాసం కల్పించాకే మూసీ నిర్వాసితుల జోలికి వెళ్లాలి
  • నవంబర్ 2న హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అమిత్ షా మహాపాదయాత్ర
  • మియాపూర్ భూముల్లో ఒక్క ఇంచు అమ్మినా అడ్డుకుంటాం

హైదరాబాద్/ బషీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాగ్, వెలుగు: ఇండియా కూటమి మాక్ పార్లమెంట్ పేరుతో ప్రజాస్వామ్య వ్యవస్థలను అపహాస్యం చేస్తున్నదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు విమర్శించారు. విద్యాసంస్థల్లో విద్యార్థుల నాయకత్వ లక్షణాల పెంపునకు మాక్ అసెంబ్లీలు, పార్లమెంట్లు నిర్వహించడం సంప్రదాయమని, రాజకీయ ప్రయోజనాల కోసం వీటిని ఉపయోగించడం సరికాదన్నారు.

2010లో లాలూ ప్రసాద్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్ పార్లమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మాక్ పార్లమెంట్ నిర్వహించినప్పుడు సోనియాగాంధీ వ్యతిరేకించారని గుర్తుచేశారు. ఇప్పుడు కాంగ్రెస్ నేతలే ఆ తరహా కార్యక్రమాలు నిర్వహించడం ఏమిటని ప్రశ్నించారు. శనివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.

మూసీ పునరుజ్జీవనం పేరుతో నిర్వహిస్తున్న పబ్లిక్ హియరింగ్ ప్రహసనంగా మారిందన్నారు. ప్రాజెక్టుతో నష్టపోయే అసలైన బాధితులను సమావేశాలకు అనుమతించకపోవడం దారుణమన్నారు. మూసీ ప్రక్షాళనకు తాము వ్యతిరేకం కాదని, పరిహారం, పునరావాసం కల్పించకుండా పేదల ఇళ్లు కూల్చితే ఊరుకోబోమని హెచ్చరించారు.

నవంబర్ 2న హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మహాపాదయాత్ర నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈవీఎంలపై విమర్శలు చేస్తున్న రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి పదవులకు రాజీనామా చేసి మాట్లాడాలని సవాల్ చేశారు. ఇండియా కూటమి ర్యాలీకి ప్రత్యేక రైళ్లు ఇవ్వలేదన్న ఆరోపణలను కూడా ఖండించారు.

కాంట్రాక్టు లెక్చరర్లను రెగ్యులరైజ్ చేయాలి

రాష్ట్రంలోని 12 యూనివర్సిటీల్లో పనిచేస్తున్న 1,200 మంది కాంట్రాక్టు అధ్యాపకులను వెంటనే రెగ్యులరైజ్ చేయాలని రాంచందర్ రావు డిమాండ్ చేశారు. హైదరాబాద్ ప్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్లబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జరిగిన అఖిలపక్ష సమావేశంలో మాట్లాడారు. గత 15 ఏళ్లుగా కాంట్రాక్టు అధ్యాపకులతోనే బోధన కొనసాగిస్తున్నారని కోదండరాం తెలిపారు.

రెగ్యులరైజేషన్ పూర్తయ్యే వరకు ఉద్యోగ భద్రత కల్పించి, ఏడో వేతన సవరణ సంఘం ప్రకారం పే స్కేల్ అమలు చేయాలని కోరారు. వీసీలు రెగ్యులరైజేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అడ్డంకులు సృష్టిస్తున్నారని కృష్ణయ్య ఆరోపించారు.

భూముల వేలం సర్కార్ ​దివాళాకోరుతనం

రంగారెడ్డి జిల్లా మియాపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని సర్వే నంబర్లు 100, 101 పరిధిలోని 550 ఎకరాల భూముల్లో ఒక్క ఇంచు అమ్మినా ప్రజలతో కలిసి అడ్డుకుంటామని రాంచందర్ రావు హెచ్చరించారు. సుప్రీంకోర్టు తీర్పుతో ప్రభుత్వానికి దక్కిన భూములను వెంటనే వేలం వేయాలని నిర్ణయించడం సరికాదన్నారు. ప్రభుత్వ భూములను అమ్మడం దివాళాకోరుతనమని, వేలం పేరుతో అనుచరులకు కట్టబెట్టే కుట్ర జరుగుతోందని ఆరోపించారు.

గతంలో బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాలు విలువైన భూములను కొల్లగొట్టేందుకు ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. ప్రభుత్వ భూములు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఉమ్మడి ఆస్తి అని స్పష్టం చేశారు.