- బంజారాహిల్స్‌లో విషాదం
జూబ్లీహిల్స్ వెలుగు : బంజారాహిల్స్‌లో ఓ కారు ఢీకొట్టడంతో తొమ్మిదేండ్ల బాలుడు కన్నుమూశాడు. మహబూబ్‌నగర్ జిల్లా కోటకద్ర గ్రామానికి చెందిన దాసు, బుజ్జి కొన్నేండ్లుగా బంజారాహిల్స్ లో కూలి పనులు చేస్కుంటున్నారు. వీరికి భాను ప్రసాద్ (9) కొడుకు. స్థానిక జడ్పీ హెచ్ఎస్స్కూల్లో ఐదో తరగతి చదువుతున్నాడు. గురువారం ఉదయం 9 గంటలకు బంజారాహిల్స్ రోడ్ నంబర్ 7లో వాటర్ ట్యాంకర్ జంక్షన్ సమీపం నుంచి స్కూల్‌కు నడుచుకుంటూ వెళ్తున్నాడు.
అదే టైంలో ఇన్నోవా క్రిస్టా కారు ఓవర్‌స్పీడ్‌తో దూసుకువచ్చి బాలుడిని ఢీకొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడిన భానను స్థానికులు దవాఖానకు తరలించగా, చికిత్స పొందుతూ కన్నుమూశాడు. డ్రైవర్ సాయి గణేష్ పారిపోయాడు. బంజారాహిల్స్‌పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు.
