TRS డబ్బులు ఇచ్చి ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తుంది : ఉత్తమ్

TRS డబ్బులు ఇచ్చి ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తుంది : ఉత్తమ్

హైదరాబాద్ : ఎన్నికల్లో TRS అక్రమాలకు పాల్పడిందన్నారు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. పార్టీ మారుతున్న ఎమ్మెల్యేలపై సీఎల్పీ సమావేశంలో చర్చించిన నేతలు…ఆ తర్వాత గాంధీ విగ్రహం దగ్గర ధర్నాకు దిగారు. పెద్ద ఎత్తున డబ్బులు ఇచ్చి ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారన్నారు. ఎమ్మెల్యే ల అనర్హతపై రేపు స్పీకర్, ఎలక్షన్ కమిషన్ కు లేఖలు రాస్తామన్నారు. మరోవైపు నియోజకవర్గాల్లో పార్టీ మారిన ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా నిరసన చేపడతామన్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క