
తమ రెండేండ్ల పాలనను చూసి జూబ్లీహిల్స్ ఓటర్లు తమను గెలిపిస్తారని కాంగ్రెస్ నమ్ముతున్నది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలనే ఆ పార్టీ ప్రధానంగా నమ్ముకుంది.
మహిళలకు ఫ్రీ బస్సు జర్నీ, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, కొత్త రేషన్ కార్డులు, సన్న బియ్యం పంపిణీ, ఇందిరమ్మ ఇండ్లు, 60 వేలకుపైగా ఉద్యోగాల భర్తీ తదితర అంశాలపై ప్రచారం చేస్తున్నది. ఈ నియోజకవర్గంలో మైనారిటీల ఓట్లు మూడో వంతు ఉండడంతో వారి మద్దతు కూడగట్టడంపై ప్రత్యేక దృష్టి పెట్టింది.
మజ్లిస్ పార్టీ సపోర్టు కూడా తమకే ఉండటంతో కలిసి వస్తుందని కాంగ్రెస్ భావిస్తున్నది. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్‌లో కాంగ్రెస్ ఒక్క సీటునూ గెలుచుకోలేక పోయింది. కానీ, ఆ తర్వాత కంటోన్మెంట్‌కు జరిగిన ఉప ఎన్నికలో గెలవడం ద్వారా గ్రేటర్లో ఖాతా తెరిచింది. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కూడా కంటోన్మెంట్ ఫలితమే రిపీట్ అవుతుందని కాంగ్రెస్ భావిస్తున్నది.