2024 ఎన్నికలకు సంబంధించి.. కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టో ప్రకటించింది. 48 పేజీలతో ఉన్న మ్యానిఫెస్టోలో ఎన్నో కీలకమైన అంశాలు ఉన్నాయి. వీటిలో ప్రధానమైన వాటిలో రెండు అంశాలు సంచలనంగా మారాయి.
దేశవ్యాప్తంగా కుల గణన చేస్తామని ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ. కుల గణన జరిగి దశాబ్దాలు అవుతుంది.. ఈ క్రమంలోనే ఇటీవల కొన్ని రాష్ట్రాల్లో కులగణన చేపట్టాయి. బీహార్, ఏపీ రాష్ట్రాలు కుల గణన చేట్టాయి. బీహార్ లో కుల గణన రిపోర్ట్ కూడా వెల్లడైంది. దేశంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ జనాభా పెరిగినట్లు బీహార్ రిపోర్ట్ వెల్లడించింది. ఇదే సమయంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దేశ వ్యాప్తంగా కుల గణన చేపట్టనున్నట్లు సంచలన హామీ ఇచ్చింది.
మరో కీలకమైన హామీ ఏంటంటే.. రిజర్వేషన్లపై ఉన్న 50 శాతం కోటా సీలింగ్ ను ఎత్తివేస్తామని.. దీని కోసం రాజ్యాంగ సవరణ చేపడతామని స్పష్టమైన హామీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ.
Also Read: పెట్రోల్, డీజిల్ రేట్లు భారీగా తగ్గిస్తాం.. మహిళలకు ఏడాదికి లక్ష
కులగణన తర్వాత ఆయా కులాల జనాభా సంఖ్య ఆధారంగా కొత్త రిజర్వేషన్ విధానాన్ని అమల్లోకి తీసుకొస్తామని స్పష్టం చేసింది కాంగ్రెస్ పార్టీ. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రిజర్వేషన్లు 50 శాతం మించకూడదు.. దేశంలో ఒకే ఒక్క తమిళనాడు రాష్ట్రంలోనే 69 శాతం రిజర్వేషన్ అమలు అవుతుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే.. దేశ వ్యాప్తంగా కుల గణన చేపట్టి.. కొత్త రిజర్వేషన్ విధానం కోసం రాజ్యాంగ సవరణ చేయనుంది.