పార్టీ అధ్యక్షుడిని ఎన్నికల ద్వారా ఎన్నుకోవాలి: గులాంనబీ ఆజాద్ 

పార్టీ అధ్యక్షుడిని ఎన్నికల ద్వారా ఎన్నుకోవాలి: గులాంనబీ ఆజాద్ 

కాంగ్రెస్‌ పార్టీకి అధ్యక్షుడి నియమించే విషయంపై పార్టీ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్  సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరో ఒకరిని అధ్యక్షుడిగా నియమించడం కంటే ఎన్నికల ద్వారానే అధ్యక్షుడిని ఎన్నుకోవాలని సూచించారు. అలా ఎన్నికైన వ్యక్తులను తొలగించడం సాధ్యం కాదన్నారు. నేరుగా నియమించే వ్యక్తికి ఒక్కశాతం మద్దతు కూడా ఉండకపోవచ్చన్నారు. ఎన్నికల ద్వారా అధ్యక్షుడిని ఎన్నుకోకుంటే పార్టీ మరో 50 ఏళ్ల పాటు ప్రతిపక్షంలో కూర్చునేందుకు సిద్ధంగా ఉండాలని తేల్చిచెప్పారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవితోపాటు రాష్ట్ర, జిల్లా, బ్లాక్ స్థాయి అధ్యక్షుల వరకు అన్ని కీలక పదవులను ఎన్నికల ద్వారానే భర్తీ చేయాలని ఆజాద్ సూచించారు. ఈ విధానాన్ని ఎవరైనా వ్యతిరేకించారంటే … వారు ఓటమికి భయపడుతున్నారనే అర్థమన్నారు. సోనియాకు లేఖ రాసిన 23 నేతల్లో ఆజాద్ కూడా ఒకరు.