కలెక్టరేట్ల వద్ద కాంగ్రెస్ ధర్నా.. రాజన్న సిరిసిల్లలో ఉద్రిక్తత

కలెక్టరేట్ల వద్ద కాంగ్రెస్ ధర్నా.. రాజన్న సిరిసిల్లలో ఉద్రిక్తత

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పిలుపు మేరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు నిరసనకు దిగారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట రైతులతో కలిసి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో మాజీ రాజ్యసభ సభ్యులు వి హనుమంతరావు పాల్గొన్నారు. రగుడు నుంచి కలెక్టరేట్ వరకు పాదయాత్ర చేశారు. పాదయాత్రతో కలెక్టరేట్ లోకి వెళ్లేందుకు యత్నించడంతో.. పోలీసులు వారికి అడ్డుకునే ప్రయత్నం చేశారు. బారికేడ్లు అడ్డుపెట్టి నిరసనకారుల్ని అడ్డుకున్నారు. దీంతో పోలీసుల తీరుపై కాంగ్రెస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బారీకేడ్లను దాటి కలెక్టరేట్ లోకి వెళేందుకు యత్నించారు. పోలీసులు, నిరసనకారుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. 

కలెక్టరేట్‭లోకి వెళ్లేందుకు యత్నం

ధరణి పోర్టల్ రద్దు చేయాలని కాంగ్రెస్ శ్రేణులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే రైతులకు లక్ష రూపాయలు రుణమాఫీ చేయాలని.. ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని అంటున్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. కలెక్టరేట్‭లోకి వెళ్తేందుకు యత్నించడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. 

రైతు సమస్యలపై కాంగ్రెస్ ధర్నా

మరోవైపు హన్మకొండ జిల్లా ఏకశిలా పార్క్, బాలసముద్రం వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ధర్నా చేస్తున్నారు.  రైతు, వ్యవసాయ భూమి సమస్యలపై ధర్నాకు దిగారు. ఈ నిరసనలో 
జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి, మాజీ మంత్రి కొండా సురేఖ, మాజీ ఎంపి రాజయ్ పాల్గొన్నారు.