కొత్త సీడబ్ల్యూసీలో.. 84 మందికి చోటు

కొత్త సీడబ్ల్యూసీలో.. 84 మందికి చోటు
  • రెగ్యులర్‌‌ మెంబర్లుగా 39 మంది
  • శాశ్వత ఆహ్వానితులుగా 32, 
  • ప్రత్యేక ఆహ్వానితులుగా 13 మందికి చోటు
  •  సీడబ్ల్యూసీని ఏర్పాటు చేసిన పార్టీ చీఫ్ ఖర్గే

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌కు కొత్త టీమ్‌‌‌‌‌‌‌‌ ఏర్పాటైంది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)ని ఆ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే పునర్వ్యవస్థీకరించారు. మొత్తం 84 మందితో కొత్త కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన 10 నెలల తర్వాత పూర్తి కమిటీని నియమించారు. 

ఈసారి 50 ఏండ్లలోపు కొత్త నేతలకు, 15 మంది మహిళలకు అవకాశం కల్పించారు. మొత్తంగా 39మంది రెగ్యులర్ సభ్యులు, 32 మంది శాశ్వత, 13 మంది ప్రత్యేక ఆహ్వానితులుగా చోటు దక్కించుకున్నారు. పార్టీలో అత్యంత నిర్ణయాత్మక కమిటీగా భావించే సీడబ్ల్యూసీలో ‘జీ23’ అసమ్మతి నేతలకు కూడా చోటు దక్కడం గమనార్హం. శాశ్వత ఆహ్వానితుల్లో రాష్ట్రాల ఇన్‌‌‌‌‌‌‌‌చార్జ్‌‌‌‌‌‌‌‌లు కూడా ఉన్నారు. యూత్ కాంగ్రెస్, ఎన్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌యూఐ, మహిళా కాంగ్రెస్, సేవాదళ్ ప్రెసిడెంట్లను ఎక్స్‌‌‌‌‌‌‌‌అఫీషియో మెంబర్లుగా నియమించారు. 

రెగ్యులర్ మెంబర్లు

ఖర్గే, సోనియా, మన్మోహన్ సింగ్, రాహుల్ గాంధీ, అధిర్ రంజన్ చౌధురి, ఏకే ఆంటోనీ, అంబికా సోని, మీరా కుమార్, దిగ్విజయ్ సింగ్, పి.చిదంబరం, తారీఖ్ అన్వర్, లాల్ తన్హావాలా, ముకుల్ వాస్నిక్, ఆనంద్ శర్మ, అశోక్‌‌‌‌‌‌‌‌రావ్ చవాన్, అజయ్ మాకెన్, చరణ్‌‌‌‌‌‌‌‌జీత్ సింగ్‌‌‌‌‌‌‌‌ చన్నీ, ప్రియాంకా గాంధీ, కుమారి సెల్జా, గైఖాంగమ్ గంగ్‌‌‌‌‌‌‌‌మీయ్, రఘువీరారెడ్డి, శశిథరూర్, తామ్రాజ్‌‌‌‌‌‌‌‌వాద్ సాహు, అభిషేక్ సింఘ్వీ, సల్మాన్  ఖుర్షీద్, జైరామ్ రమేశ్, జితేంద్ర సింగ్, రణ్‌‌‌‌‌‌‌‌దీప్ సుర్జేవాలా, సచిన్ పైలట్, దీపక్ బబారియా, జగదీశ్ ఠాకూర్​, జీఏ మిర్, అవినాశ్ పాండే, దీపా దాస్ మున్షి, మహేంద్రజీత్ సింగ్ మాలవీయ,గౌరవ్ గొగొయ్, సయ్యద్ నజీర్ హుస్సేన్, కమలేశ్వర్ పటేల్, కేసీ వేణుగోపాల్. 

శాశ్వత ఆహ్వానితులు

కన్నయ్య కుమార్, మోహన్ ప్రకాశ్, కె.రాజు, చంద్రకాంత్ హండోరె, మీనాక్షి నటరాజన్, ఫూలో దేవి నేతమ్, సుదీప్ రాయ్ బర్మన్, దామోదర రాజ నర్సింహా, గుర్దీప్ సప్పల్, సచిన్ రావ్, అజోయ్ కుమార్, ఎ.చెల్లా కుమార్, బీకే హరిప్రసాద్, భక్త చరణ్‌‌‌‌‌‌‌‌దాస్, దీపేందర్ సింగ్ హుడా, దేవేంద్ర యాదవ్, గిరీశ్ గయా ఛోడంకర్, హరీశ్ చౌధరి, హరీశ్ రావత్, మాణిక్కం ఠాగూర్, మాణిక్‌‌‌‌‌‌‌‌రావ్ థాక్రే, మనీశ్ ఛత్రత్, మనీశ్ తివారీ, పవన్ కుమార్ బన్సల్, రాజీవ్ శుక్లా, రజనీ పాటిల్, రమేశ్ చెన్నితల, సుఖ్‌‌‌‌‌‌‌‌జిందర్ సింగ్ రణ్‌‌‌‌‌‌‌‌ధవా, టి.సుబ్బరామిరెడ్డి, తారీఖ్ హమీద్ కర్రా, ప్రతిభా సింగ్, వీరప్ప మొయిలీ.

ప్రత్యేక ఆహ్వానితులు

వంశీ చంద్‌‌‌‌‌‌‌‌రెడ్డి, పల్లం రాజు, పవన్ ఖేరా, గణేశ్ గొడియాల్, కొడిక్కునిల్ సురేశ్, యశోమతి ఠాకూర్, సుప్రియా శ్రినటే, ప్రణతి షిండే, ఆల్కా లాంబా, శ్రీనివాస్ బీవీ, నీరజ్ కందన్, నెట్టా డిసౌజా, లాల్జీ దేశాయ్.

‘జీ23’ నేతలకూ చోటు

అసమ్మతి వర్గం(గ్రూప్ 23) కు చెందిన నేతలకూ సీడబ్ల్యూసీలో చోటు దక్కింది. ముకుల్ వాస్నిక్, ఆనంద్ శర్మ, శశిథరూర్, మనీశ్ తివారీ, వీరప్ప మొయిలీ తదితరులు జాబితాలో ఉన్నారు. ఇక రాజస్థాన్‌‌‌‌‌‌‌‌కు చెందిన రెబల్‌‌‌‌‌‌‌‌ నేత సచిన్ పైలట్‌‌‌‌‌‌‌‌కు కూడా అవకాశమివ్వడం గమనార్హం. ఆయన తొలిసారిగా వర్కింగ్‌‌‌‌‌‌‌‌ కమిటీలోకి వచ్చారు. సీడబ్ల్యూసీలో మొత్తం 15 మంది మహిళలకు చోటు దక్కింది. రెగ్యులర్ సభ్యులుగా ఆరుగురికి, శాశ్వత ఆహ్వానితులుగా నలుగురికి, ప్రత్యేక ఆహ్వానితులుగా ఐదుగురికి అవకాశమిచ్చారు. 

గౌరవంగా భావిస్తున్నా: శశిథరూర్

సీడబ్ల్యూసీలో చోటు దక్కడాన్ని గౌరవంగా భావిస్తున్నానని తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ అన్నారు. ‘‘గత 138 ఏండ్లుగా పార్టీకి మార్గనిర్దేశం చేయడంలో సీడబ్ల్యూసీ పోషించిన చారిత్రాత్మక పాత్ర గురించి తెలిసిన వ్యక్తిగా.. నేను ఈ సంస్థలో భాగమైనందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అంకితభావంతో కూడిన సహచరులతో కలిసి పార్టీకి సేవ చేసే అవకాశం కోసం ఎదురు చూస్తున్నా” ట్వీట్ చేశారు.

పార్టీ సిద్ధాంతాలను బలోపేతం చేస్తం: సచిన్ పైలట్

తనను సీడబ్ల్యూసీలోకి తీసుకున్నందుకు సచిన్ పైలట్‌‌‌‌‌‌‌‌ కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ సిద్ధాంతాలను బలోపేతం చేస్తామని ఆయన చెప్పారు. ‘‘కాంగ్రెస్ సంప్రదాయాలు, విధానాలు, సిద్ధాంతాలను బలోపేతం చేస్తాం. వాటిని మరింత బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తాం” అని ట్వీట్ చేశారు.