ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పోటెత్తిన నామినేషన్లు!

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పోటెత్తిన నామినేషన్లు!
  • కొత్తగూడెం కార్పొరేషన్​, ఏదులాపురంలో కాంగ్రెస్​, సీపీఐ మధ్య కుదరని పొత్తు
  • వేర్వేరుగా ఆయా పార్టీల తరఫున నామినేషన్లు

ఖమ్మం, వెలుగు : ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని మున్సిపాలిటీల్లో చివరి రోజు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. మొదటి రెండ్రోజుల కంటే అన్ని మున్సిపాలిటీల్లో రెట్టింపు సంఖ్యలో నామినేషన్లు ఫైలయ్యాయి. ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల వరకు లైన్లలో వేచి చూసి మరీ నామినేషన్​ వేశారు. ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు ఇండిపెండెంట్లు కూడా పెద్ద సంఖ్యలోనే నామినేషన్​ వేశారు. మరోవైపు కొన్ని మున్సిపాలిటీల్లో ప్రధాన పార్టీల మధ్య చివరి రోజు వరకు పొత్తు ఫైనల్ కాకపోవడంతో వేర్వేరుగానే అభ్యర్థులతో నామినేషన్లు దాఖలు చేయించారు. దీంతో నామినేషన్ల విత్ డ్రాకు చివరి రోజు వరకు పొత్తు చర్చలకు అవకాశం ఉంటుందని ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ నామినేషన్ల పరిశీలన ఉంటుంది.

కుదరని పొత్తులు..

కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్​, ఏదులాపురం మున్సిపాలిటీలో కొన్ని రోజులుగా కాంగ్రెస్​, సీపీఐ నేతల మధ్య జరుగుతున్న పొత్తు చర్చలు కొలిక్కిరాలేదు. దీంతో రెండు పార్టీలు తమ అభ్యర్థులతో అన్ని వార్డులు, డివిజన్లకు నామినేషన్లు దాఖలు చేయించాయి. ఏదులాపురంలో ఏడు వార్డులతో పాటు మూడు వార్డుల్లో ఫ్రెండ్లీ కాంటెస్ట్ ఉంటుందని, భవిష్యత్​ లో ఒక సొసైటీ చైర్మన్​ పదవిని, కో ఆప్షన్ పదవిని కేటాయించాలంటూ సీపీఐ డిమాండ్ చేసినట్టు సమాచారం. చివరకు కాంగ్రెస్​ నేతలు ఆరు వార్డులతో పాటు సొసైటీ చైర్మన్​ కు అంగీకరించినా ఆర్థిక పరమైన ఇతర అంశాల్లో ఏకాభిప్రాయం రాకపోవడంతో పొత్తులు కుదర్లేదు.

కొత్తగూడెం కార్పొరేషన్​ లోనూ సీపీఐ డిమాండ్​ చేసిన డివిజన్ల సంఖ్యతో పాటు డిప్యూటీ మేయర్​ పదవిపై రెండు పార్టీల మధ్య అంగీకారం కుదరకపోవడంతో వేర్వేరుగానే కాంగ్రెస్​, సీపీఐ అభ్యర్థులు నామినేషన్లు వేశారు. అదే సమయంలో ప్రతి వార్డులోనూ ప్రధాన పార్టీలు ఒకరికి పైగా అభ్యర్థులతో నామినేషన్లు వేయించాయి. నామినేషన్ల పరిశీలనతో పాటు టెక్నికల్ ఎలాంటి సమస్య లేకుండా ముందు జాగ్రత్త చర్యగా డమ్మి అభ్యర్థులతోనూ నామినేషన్లు ఫైల్ చేయించారు. 

ప్రచారం షురూ..

అన్ని మున్సిపాలిటీల్లో ఇప్పటికే నామినేషన్లు వేసిన అభ్యర్థులు తమ ప్రచారాన్ని మొదలుపెట్టారు. పార్టీ గుర్తులపైనే ఎన్నికలు జరుగుతుండడంతో బీ ఫామ్​ తో సంబంధం లేకుండానే ఓటర్లను కలుస్తూ తమను గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అదే సమయంలో అన్ని వార్డుల్లో ఒకటి కంటే ఎక్కువ మంది అభ్యర్థులు ఆయా పార్టీల తరఫున నామినేషన్లు వేయడంతో, టికెట్ కన్ఫామ్​ చేయించుకునేందుకు గాడ్​ ఫాదర్ల ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు కొన్ని వార్డుల్లో ఏకగ్రీవానికి కూడా ప్రయత్నాలు మొదలయ్యాయి. నామినేషన్లు వేసిన అభ్యర్థులతో బేరసారాలు చేస్తూ, పోటీ నుంచి తప్పుకోవాలంటూ క్యాండిడేట్లతో పాటు వారి సన్నిహితులతో చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. 

 ఉమ్మడి జిల్లావ్యాప్తంగా నామినేషన్ల వివరాలు..