జీవో నెంబర్ 46ను రద్దు చేయండి : న్యాయం చేయాలని కానిస్టేబుల్ అభ్యర్థుల డిమాండ్

జీవో నెంబర్ 46ను రద్దు చేయండి : న్యాయం చేయాలని కానిస్టేబుల్ అభ్యర్థుల  డిమాండ్

జీవో నెంబర్ 46ను రద్దు చేయాలని కానిస్టేబుల్ అభ్యర్థుల పోరాట సమితి డిమాండ్ చేసింది. మళ్లీ పాత పద్ధతిలోనే పోలీస్ నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. పాత పద్ధతిలోనే TSSP, ఐటీ, కమ్యూనికేషన్ పోస్టులను భర్తీ చేయాలని కోరారు. జీవో నెంబర్ 46 వల్ల నష్టపోయిన వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. 

హైదరాబాద్ లోని ఇందిరాపార్క్ ధర్నాచౌక్ వద్ద కానిస్టేబుల్ అభ్యర్థులు శాంతియుత నిరసన దీక్ష చేపట్టారు. దీక్షా శిబిరాన్ని వామపక్ష పార్టీల నాయకులు, ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ నాయకులు సందర్శించి.. సంఘీభావం ప్రకటించారు.

తెలంగాణ రాష్ట్రంలోని మూడు జిల్లాల వారికి 53 శాతం రిజర్వేషన్, మిగతా జిల్లాలకు 47శాతం రిజర్వేషన్ ఇవ్వడం కారణంగా గ్రామీణ ప్రాంతాల అభ్యర్థులకు అన్యాయం జరిగిందన్నారు. తక్షణమే 46 జీవోను రద్దు చేయాని కోరారు.