కాళ్లు మొక్కుతాం సారూ.. జీవో నం. 46ను రద్దు చేయాండి..

కాళ్లు మొక్కుతాం సారూ..  జీవో నం. 46ను రద్దు చేయాండి..

సారూ.. మీ కాళ్లు మొక్కుతాం.. 46 జీవోను రద్దు చేయాండి అంటూ.. కానిస్టేబుల్ అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ కొత్తపేట్ చౌరస్తాలో రోడ్డుపై వాహనాలను అడ్డుకొని.. జీవో 46ను రద్దు చేయాలని నిరసనకు దిగారు. గతంతో నియామకాల మాదిరిగానే.. ఇప్పుడు నియామకాలు జరపాలని డిమాండ్ చేశారు. నోటిఫికేషన్ లో సమయంలో ఈ జీవో గురించి ఎక్కడా ప్రస్తావన లేదని.. కానీ సెలక్షన్ సమయంలో దీన్ని తెరపైకి తెచ్చారన్నారని మండిపడ్డారు. 

జీవో నం.46 ప్రకారం ఉమ్మడి హైదరాబాద్ జిల్లాకు 53శాతం రిజర్వేషన్లు కల్పించి మిగతా జిల్లాలకు 47శాతం కేటాయిస్తున్నారన్నారని అభ్యర్థులు తెలిపారు. దీంతో జిల్లాల్లోని అభ్యర్థులకు ఎక్కువ మార్కులు వచ్చినా అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. జీవో రద్దుపై ప్రభుత్వానికి ఎన్ని విధాలుగా విన్నమించుకున్న స్పదించడం లేదన్నారు. వెంటనేజీవో46ను రద్దు చేయాలని లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు చేపడుతామని హెచ్చరించారు. దీంతో ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు.