
- మేల్కొని నిలదీసిన ప్రయాణికురాలు
- ‘నా ఉద్యోగం పోతుంది వీడియో తీయొద్దు’ అని వేడుకోలు నిందితుడిపై సస్పెన్షన్ వేటు
లక్నో: రైల్లో నిద్రపోతున్న మహిళా ప్యాసింజర్ తో ఓ రైల్వే పోలీస్ కానిస్టేబుల్ అసభ్యంగా ప్రవర్తించి సస్పెన్షన్ కు గురయ్యాడు. ఢిల్లీ నుంచి ప్రయాగ్ రాజ్ కు వెళుతున్న ట్రెయిన్ లో ఈ నెల 14న రాత్రి ఈ ఘటన జరగగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిందితుడిని ఆశిష్ గుప్తాగా గుర్తించారు. ఓ ప్రయాణికురాలు తాను రిజర్వ్ చేసుకున్న బెర్త్ లో నిద్రపోతుండగా.. కానిస్టేబుల్ గుప్తా ఆమె వద్దకు వెళ్లి అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో మేల్కొన్న ప్రయాణికురాలు.. అతడిని నిలదీసింది. ‘‘అలా చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ప్రజల భద్రత కోసమే కదా మీరు ఉన్నారు.
ప్రజలను సేఫ్ గా చూడాల్సిన మీరే అసభ్యంగా ప్రవర్తిస్తే ఎలా?” అని బాధితురాలు ప్రశ్నిస్తూ వీడియో తీసింది. వీడియో తీయవద్దని, ఈ విషయం బయటికి తెలిస్తే, తన ఉద్యోగం పోతుందని కానిస్టేబుల్ చేతులు జోడించి బాధితురాలికి వేడుకున్నాడు. ఈ క్రమంలో ఆమె దగ్గరికి వెళ్లి మాట్లాడుతుండగా.. ముందు మీరు దూరంగా నిలబడాలని ప్రయాణికురాలు అతడిని మందలించింది.