కాగితాలపైనే ‘డబుల్‌‌‌‌‌‌‌‌’ ఇళ్లు

కాగితాలపైనే ‘డబుల్‌‌‌‌‌‌‌‌’ ఇళ్లు
  • బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌‌‌‌‌‌‌‌రావు

టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ అవినీతిమయమైందని, పేదలకు ఇస్తామన్న డబుల్​బెడ్రూం ఇళ్ల నిర్మాణం కాగితాలకే పరిమితమైందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌‌‌‌‌‌‌‌రావు మంగళవారం విమర్శించారు. ‘దేశంలో ఎక్కువ రోడ్లను నిర్మించింది తెలంగాణలో కాదా? దమ్ముంటే కేసీఆర్‌‌‌‌‌‌‌‌ కాదని చెప్పాలి’ అని సవాల్ విసిరారు. ‘కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌‌‌‌‌‌‌‌ ఫిక్సింగ్‌‌‌‌‌‌‌‌ పార్టీ. ఆ పార్టీ నుంచి గెలిచిన వారు టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌లో మంత్రులవుతున్నారు. బయట ఉన్న వాళ్లు టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌కు లోపాయకారిగా మద్దతిస్తున్నారు’ అన్నారు. టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ అభివృద్ధి వ్యతిరేక పనులపై బీజేపీ పోరాడుతుందన్నారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌‌‌‌‌‌‌‌రెడ్డి విమర్శలకూ కౌంటరిచ్చారు. బీజేపీది వాపో, బలుపో రాహుల్‌‌‌‌‌‌‌‌గాంధీకి తెలుసన్నారు. కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ను రాహుల్‌‌‌‌‌‌‌‌ చీకటిమయం చేశారని ఎద్దేవా చేశారు. కర్నాటకలో కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌, జేడీఎస్‌‌‌‌‌‌‌‌ కూటమి వల్ల ప్రజలకు న్యాయం జరగదని తెలిసిపోయిందన్నారు.