కేబుల్‌ బ్రిడ్జి వద్ద రూ.6 కోట్లతో డైనమిక్ లైటింగ్

కేబుల్‌ బ్రిడ్జి వద్ద రూ.6 కోట్లతో డైనమిక్ లైటింగ్

కరీంనగర్‌‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని జిల్లాకు చెందిన మంత్రి గంగుల కమలాకర్ చెప్పారు. కరీంనగర్‌‌కు మణిహారంలా రూ.183 కోట్లతో చేపట్టిన కేబుల్ బ్రిడ్జి నిర్మాణం పూర్తి కావస్తోందని, కమాన్ నుంచి కేబుల్ బ్రిడ్జి వరకు  మరో 40 కోట్లతో సెంట్రల్ లైటింగ్‌తో కూడిన రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయని గంగుల తెలిపారు. కేబుల్ బ్రిడ్జి వద్ద 6 కోట్లతో డైనమిక్ లైట్లు ఏర్పాటు చేస్తామని, ఇలాంటి లైటింగ్ ఇండియాలోనే ఇక్కడ తొలిసారి ఏర్పాటు చేయబోతున్నామని అన్నారు. రైతులకు సర్వీస్ రోడ్డు, ఇతర సదుపాయాలకు 7 కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. మరో మూడు నెలల్లోనే కేబుల్ బ్రిడ్జి పూర్తి స్థాయిలో సిద్ధం అవుతుందని చెప్పారు. కరీంనగర్ నుంచి సిరిసిల్లకు వెళ్లే నాలుగు లైన్ల రోడ్డు కూడా అద్భుతంగా తయారవుతోందన్నారు గంగుల. కరీంనగర్ అభివృద్ధికి రూ.350 కోట్ల నిధులు కేటాయించగా.. ఇప్పటికే 100 కోట్ల పనులు పూర్తయ్యాయని చెప్పారు. కాగా, వరదల వల్ల డ్యామేజ్‌ అయిన చెక్ డ్యామ్‌లను డిజైన్ మార్చి మళ్లీ నిర్మిస్తామని చెప్పారు.