ఇంటిగ్రేటెడ్‌‌‌‌‌‌‌‌ మార్కెట్లు పూర్తి కాలే.. మూడేండ్ల కింద పనులు ప్రారంభించిన బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ సర్కార్‌‌‌‌‌‌‌‌

ఇంటిగ్రేటెడ్‌‌‌‌‌‌‌‌ మార్కెట్లు పూర్తి కాలే..  మూడేండ్ల కింద పనులు ప్రారంభించిన బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ సర్కార్‌‌‌‌‌‌‌‌

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : రాష్ట్రంలో ఇంటిగ్రేటెడ్‌‌‌‌‌‌‌‌ మార్కెట్ల నిర్మాణ పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. గత బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ సర్కార్‌‌‌‌‌‌‌‌ 2021లో ఆర్భాటంగా పనులను ప్రారంభించి నిధుల విడుదలను మాత్రం పట్టించుకోలేదు. దీంతో రాష్ట్రంలోని 135కి పైగా మున్సిపాలిటీల్లో చేపట్టిన మార్కెట్ల నిర్మాణ పనులు అసంపూర్తిగా మిగిలాయి. కొన్ని చోట్ల స్లాబ్‌‌‌‌‌‌‌‌లు, పిల్లల లెవల్‌‌‌‌‌‌‌‌లో నిలిచిపోగా మరికొన్ని భూ సేకరణతోనే సరిపెట్టారు. 

మూడేండ్ల కింద ప్రారంభంఒక్కో మున్సిపాలిటీలో ఇంటిగ్రేటెడ్‌‌‌‌‌‌‌‌ మార్కెట్‌‌‌‌‌‌‌‌ నిర్మాణానికి రూ. 4.5 కోట్లు కేటాయించారు. ముందుగా సిద్దిపేటలో ఇంటిగ్రేటెడ్‌‌‌‌‌‌‌‌ మార్కెట్‌‌‌‌‌‌‌‌ను నిర్మించిన ప్రభుత్వం రాష్ట్రంలోని 135 మున్సిపాలిటీల్లోనూ ఇదే తరహాలో మార్కెట్లు నిర్మిస్తామని చెప్పింది. ఏడాదిలోనే వీటిని పూర్తి చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఫండ్స్‌‌‌‌‌‌‌‌ విడుదల చేయడాన్ని మాత్రం మర్చిపోయింది.

దీంతో కొన్ని మున్సిపాలిటీల్లో మార్కెట్ల నిర్మాణ పనులు పిల్లర్ల లెవల్‌‌‌‌‌‌‌‌లో ఆగిపోగా, మరికొన్ని చోట్ల స్లాబ్‌‌‌‌‌‌‌‌ లెవల్‌‌‌‌‌‌‌‌లో నిలిచిపోయాయి. ఇంకా కొన్ని మున్సిపాలిటీల్లో అయితే ల్యాండ్‌‌‌‌‌‌‌‌ సేకరణకే పరిమితం అయ్యాయి. ఇంటిగ్రేటెడ్‌‌‌‌‌‌‌‌ మార్కెట్లను పూర్తి చేయాలని కలెక్టర్లు, ఎమ్మెల్యేలు ఆఫీసర్లపై ఆగ్రహం వ్యక్తం చేసినప్పుడల్లా కాంట్రాక్టర్లను బతిమిలాడుతూ పనులు చేయించేవారు. మూడేండ్లు గడుస్తున్నా మార్కెట్లు పూర్తి స్థాయిలో కంప్లీట్‌‌‌‌‌‌‌‌ కాలేదు.

పాతది ఖాళీ చేయించిన్రు.. కొత్తది ఆపేసిన్రు


భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో నిర్మాణ పనులు చేపట్టగా మణుగూరులో ఇప్పటివరకు ల్యాండ్‌‌‌‌‌‌‌‌ సేకరణే పూర్తి కాలేదు. కొత్తగూడెం, ఇల్లెందు మున్సిపాలిటీల్లో పనులు నత్తనడకన సాగుతున్నాయి. కొత్తగూడెం పట్టణం నడిబొడ్డున గల పాత మార్కెట్‌‌‌‌‌‌‌‌ స్థానంలో ఇంటిగ్రేటెడ్‌‌‌‌‌‌‌‌ మార్కెట్ నిర్మిస్తామంటూ అక్కడి వ్యాపారులను ఖాళీ చేయించారు.

దీంతో సమీపంలోని ఖాళీ స్థలంలో టెంట్లు వేసుకొని కూరగాయలు, ఆకుకూరలు అమ్ముతున్నారు. వర్షం పడితే ఆ ప్రాంతం మొత్తం బురదమయంగా మారుతోంది. కొత్త మార్కెట్ కడుతామంటే అక్కడి నుంచి ఖాళీ చేశామని, ఏండ్లు గడుస్తున్నా మార్కెట్ పనులు పూర్తి కాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వ్యాపారులు, రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు బిల్లులు కోట్లలో పెండింగ్‌‌‌‌‌‌‌‌లో ఉంటే పనులు ఎలా చేయాలంటూ కాంట్రాక్టర్లు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వం మార్కెట్ల నిర్మాణాలపై దృష్టి పెట్టాలని ప్రజలు 
కోరుతున్నారు.