ఆసీస్‌‌–ఎ జట్టులో కాన్‌‌స్టస్‌‌, మెక్‌‌స్వీనికి చోటు

ఆసీస్‌‌–ఎ జట్టులో కాన్‌‌స్టస్‌‌, మెక్‌‌స్వీనికి చోటు

సిడ్నీ: ఇండియా–ఎతో జరిగే రెండు నాలుగు రోజుల మ్యాచ్‌‌లు, మూడు వన్డేల సిరీస్‌‌కు ఆస్ట్రేలియా–ఎ టీమ్‌‌లను ప్రకటించారు. బోర్డర్‌‌–గావస్కర్‌‌ ట్రోఫీలో డెబ్యూ చేసిన సామ్‌‌ కాన్‌‌స్టస్‌‌, నాథన్‌‌ మెక్‌‌స్వీని నాలుగు రోజుల మ్యాచ్‌‌లకు తీసుకున్నారు. ఇండియాతో సిరీస్‌‌కు మెక్‌‌స్వీని ప్లేస్‌‌లో వచ్చిన కాన్‌‌స్టస్‌‌ లైనప్‌‌లో టాప్‌‌ ఆర్డర్‌‌లో చోటు సంపాదించలేకపోయాడు. మెల్‌‌బోర్న్‌‌ టెస్ట్‌‌లో హాఫ్‌‌ సెంచరీతో పాటు కోహ్లీతో మాటల దాడికి దిగి ఒక్కసారిగా వార్తల్లోకి ఎక్కాడు. 

ఆ తర్వాత వెస్టిండీస్‌‌తో సిరీస్‌‌లో కంగారూలు పూర్తి ఆధిపత్యం చూపెట్టినా కాన్‌‌స్టన్‌‌ ఫెయిలయ్యాడు. కూపర్‌‌ కనోలీ, స్పిన్నర్‌‌ టాడ్‌‌ మర్ఫికి చోటు దక్కింది. ఇప్పటి వరకు ఏడు టెస్ట్‌‌లు ఆడిన మర్ఫి 2022–23 ఇండియా టూర్‌‌లో నాలుగు మ్యాచ్‌‌ల్లో ఆడాడు. ఆస్ట్రేలియా 1–2 తేడాతో ఓడిన ఈ సిరీస్‌‌లో 14 వికెట్లు తీశాడు. సెప్టెంబర్‌‌ 16 నుంచి 19 వరకు, 23 నుంచి 26 వరకు లక్నోలో నాలుగు రోజులు మ్యాచ్‌‌లు జరుగుతాయి. మూడు వన్డేలు వరుసగా సెప్టెంబర్‌‌ 30, అక్టోబర్‌‌ 3, 5వ తేదీల్లో ఆడనున్నారు.