8 ఏళ్ల కనిష్టానికి రిటైల్ ద్రవ్యోల్బణం

8 ఏళ్ల కనిష్టానికి రిటైల్ ద్రవ్యోల్బణం
  • సెప్టెంబర్​లో 1.54 శాతం

న్యూఢిల్లీ: వినియోగదారుల ధరల సూచీ -ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం సెప్టెంబర్​లో గణనీయంగా తగ్గి 1.54 శాతానికి చేరుకుంది. ఇది ఎనిమిదేళ్ల కనిష్టం కావడం విశేషం. అంతకుముందు నెలలో ఇది 2.07 శాతం ఉండేది. కూరగాయలు, పప్పులు,  ఇతర ఆహార పదార్థాల ధరలు అదుపులో ఉండటం ద్రవ్యోల్బణం తగ్గడానికి ప్రధాన కారణమని జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్ఓ) తెలిపింది. 

2024 సెప్టెంబర్​లో ఈ ద్రవ్యోల్బణం ఏకంగా 5.49 శాతం గా ఉంది. ఆహార ద్రవ్యోల్బణం గత నెల –2.28 శాతం గా నమోదైంది. ఈ ఆర్థిక సంవత్సరం మరుసటి ఆరు నెలల ద్రవ్యోల్బణం అంచనాను ఆర్​బీఐ కూడా తగ్గించింది. ఆరోగ్యకరమైన నైరుతి రుతుపవనాల పురోగతి, అధిక ఖరీఫ్ సాగు,  రిజర్వాయర్లలో భారీగా నీరు ఉండటం,  ధాన్యాల బఫర్ స్టాక్ కారణంగా ఆహార ధరలు అదుపులో ఉంటాయని పేర్కొంది.