లింక్​ దొరకట్లే..సవాల్ గా మారుతున్నకరోనా కాంటాక్ట్ లు

లింక్​ దొరకట్లే..సవాల్ గా మారుతున్నకరోనా కాంటాక్ట్ లు

హైదరాబాద్, వెలుగుకరోనా కేసుల కాంటాక్ట్​ల ట్రేసింగ్‌‌లు జీహెచ్‌‌ఎంసీకి సవాల్‌‌గా మారాయి. రోజురోజుకూ పెరుగుతున్న  కేసులతో  అధికారులు పరుగులు పెడుతున్నారు. కంటెయిన్‌‌మెంట్‌‌ జోన్లు ఏర్పాటు చేస్తున్నారు. వ్యక్తులకు వైరస్‌‌ ఎలా వచ్చిందో తెలుసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ట్రావెల్‌‌ హిస్టరీ నుంచి ప్రైమరీ కాంటాక్ట్‌‌ల వివరాలు సేకరిస్తున్నారు. కొన్ని కేసుల్లో లింకులు దొరకడం లేదని అధికారులు చెప్తున్నారు.

ట్రావెల్‌‌ హిస్టరీ లేకున్నా..

పాజిటివ్‌‌ కేసులు వచ్చిన ఏరియాలో బల్దియా అధికారులు డిఫరెంట్‌‌ వేస్‌‌లో స్టడీ చేస్తున్నారు.  ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్‌‌లను సెర్చ్‌‌ చేస్తుండగా వైరస్‌‌ వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది. శుక్రవారం ఆల్విన్‌‌ కాలనీకి చెందిన వ్యక్తికి పాజిటివ్‌‌ వచ్చింది. ఆయన కారు డ్రైవర్‌‌కూ వైరస్‌‌ సోకినట్టు నిర్ధారణ అయింది. డ్రైవర్‌‌ ట్రావెల్‌‌ హిస్టరీ పరిశీలించి హాస్టల్‌‌లో ఉంటున్న అతడి ద్వారానే ఓనర్‌‌కు కరోనా సోకిందని అంచనాకు వచ్చారు. హాస్టల్‌‌లోని మిగిలిన వ్యక్తులకూ టెస్ట్‌‌లు చేయించారు. ఎవరెవరు ఎక్కడెక్కడ తిరిగారో వివరాలు తీసుకుంటున్నారు. ఇలా ఒక్కచోట మొదలైన ట్రేసింగ్‌‌ మలుపులు తిరుగుతోంది. మూసాపేటలో ఓ డాక్టర్‌‌కు వైరస్‌‌ సోకింది. లాక్‌‌డౌన్‌‌ స్టార్​ అయినప్పటి నుంచి ఆయన హాస్పిటల్‌‌కు వెళ్లలేదు. ట్రావెల్‌‌ హిస్టరీ లేదు.  వైరస్‌‌ ఎలా సోకిందనేది అంతుచిక్కడం లేదు.

డీటెయిల్స్​ ఇస్తలేరు

ప్రతి పాజిటివ్‌‌ కేసులోనూ కాంటాక్ట్‌‌ చైన్​ ఎక్కువగా ఉండడం అధికారులకు తలనొప్పిగా మారింది. ఇంతకుముందు కరోనా వస్తే ఆ వ్యక్తి ఇల్లు ఉన్న గల్లీ మొత్తం కంటెయిన్‌‌ మెంట్‌‌ జోన్‌‌ చేసేవారు. నిర్వహణ ఇబ్బందులతో ప్రస్తుతం పాజిటివ్‌‌ వ్యక్తుల ఫ్యామిలీనే హోమ్‌‌ క్వారంటైన్‌‌ చేస్తున్నారు. కాంటాక్ట్‌‌ల ట్రేసింగ్‌‌పైనే ఎక్కువ ఫోకస్‌‌ పెడుతున్నారు. కానీ పాజిటివ్‌‌ వచ్చిన కొందరు ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్‌‌ల వివరాలు చెప్పకపోవడం వల్ల వైరస్‌‌ వ్యాప్తి తీవ్రమవుతోందని కంటెయిన్‌‌మెంట్‌‌ జోన్‌‌లో డ్యూటీ చేస్తున్న ఓ అధికారి తెలిపారు. అలాంటి కేసులో లింకులు ట్రేస్‌‌ చేయడం చాలా కష్టమవుతోందని చెప్పారు.

వారియర్స్ నూ వదలని వైరస్