జూనియర్ ఎన్టీఆర్ కు గాయాలు.. అతని ప్రస్తుత పరిస్థితి.. ఆరోగ్యంపై అధికారిక ప్రకటన రిలీజ్ అయ్యింది. జూనియర్ ఎన్టీఆర్ ఆఫీస్ నుంచి నోట్ రిలీజ్ చేశారు. యాడ్ షూటింగ్ లో ఎన్టీఆర్ గాయపడింది నిజమే అని.. భయపడాల్సినంతగా ఏమీ కాలేదని వివరణ ఇచ్చింది ఎన్టీఆర్ ఆఫీస్ టీం. 2 వారాలు అంటే.. 15 రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుందని.. డాక్టర్ సూచనలతో ఇంట్లోనే ఎన్టీఆర్ విశ్రాంతి తీసుకుంటారని ఆఫీస్ రిలీజ్ చేసిన నోట్ స్పష్టం చేస్తోంది.
Also Read:- హీరో జూనియర్ ఎన్టీఆర్ కు గాయాలు... ఫ్యాన్స్ లో ఆందోళన
ఎన్టీఆర్ కార్యాలయం ప్రకటనలో ఏం చెప్పారంటే..
ఈరోజు ఒక వాణిజ్య ప్రకటన చిత్రీకరణలో జూనియర్ ఎన్టీఆర్ స్వల్పంగా గాయపడ్డారు. వైద్యుల సలహా మేరకు ఆయన పూర్తిస్థాయిలో కోలుకోవడానికి మరో రెండు వారాలు విశ్రాంతి తీసుకుంటారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అందరికీ తెలియజేస్తున్నాము. అభిమానులు, మీడియా, ప్రజలు ఎలాంటి ఊహాగానాలను నమ్మవద్దని మేము వినయపూర్వకంగా కోరుతున్నాము," అంటూ ఎన్టీఆర్ ఆఫీస్ నుంచి అధికారికంగా నోట్ రిలీజ్ కావటంతో.. ఫ్యాన్స్ కుదుటపడ్డారు.
Get Well Soon Anna !! pic.twitter.com/8hIGyNKJf3
— RAW NTR (@RAWNTR) September 19, 2025
సినీ వర్గాల సమాచారం ప్రకారం, షూటింగ్ జరుగుతున్న సమయంలో.. అనుకోకుండా ఎన్టీఆర్ కిందపడటంతో గాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన ఆయన సిబ్బంది, తారక్‌ను హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ఆయనకు అవసరమైన చికిత్స అందించారు. ఆ వెంటనే ఇంటికి పంపించారు. గాయంపై ఆందోళన పడాల్సిన అవసరం లేదని ఎన్టీఆర్ కు దైర్యం చెప్పారు డాక్టర్లు.
