హైదరాబాద్లో సైబర్ నేరగాళ్ల అటాక్.. డిజిటల్ అరెస్ట్ పేరుతో 80లక్షలు దోచుకున్నారు

హైదరాబాద్లో సైబర్ నేరగాళ్ల అటాక్.. డిజిటల్ అరెస్ట్ పేరుతో 80లక్షలు దోచుకున్నారు

హైదరాబాద్లో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోయారు. అధికారులమని నమ్మించారు.. నకిలీ సుప్రీంకోర్టు నోటీసులు చూపించి భయపెట్టారు డిజిటల్ అరెస్ట్ అంటూ భయపెట్టి బ్యాంకు ఖాతా ఖాళీ చేశారు.  లక్షలు దోచుకున్నారు. హైదరాబాద్ లోని హబ్సిగూడలో ఓ రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగిని భయపెట్టి రూ. 80లక్షలు దోచుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది.. వివరాల్లోకి వెళితే.. 

హైదరాబాద్ పరిధిలోని హబ్సిగూడలో 83 ఏళ్ల రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగిని అధికారులమని నమ్మించి డిజిటల్ అరెస్టు పేరుతో సైబర్ నేరాగాళ్లు దోచుకున్నారు. TRAI, పోలీసులుగా నటించిన మోసగాళ్లు ఆ వృద్ధుడి ఖాతానుంచి రూ.80.64 లక్షలు తమ అకౌంట్లకు మళ్లించుకున్నారు. 

మానవ అక్రమ రవాణా కేసులో బాధితుడి ఆధార్ కార్డు వినియోగించారని, కంబోడియా, మయన్మార్, పిలిప్పీన్స్ దేశాల్లో మానవ రవాణా కేసులు ఉన్నాయని నమ్మబలికారు. నకిలీ సుప్రీంకోర్టు నోటీసు, ఎటిఎమ్ కార్డు చూపించి మోసానికి పాల్పడ్డారు. 

సైబర్ నేరగాళ్లు పోలీసులమని చెప్పడంతో భయపడిపోయిన బాధితుడు వరుసగా లక్షల రూపాయలు మోసగాళ్ల ఖాతాకు ట్రాన్స్‌ఫర్ చేశాడు. తర్వాత విషయం తెలుసుకొని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. 

సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలంటున్నారు పోలీసులు. డిజిటల్ అరెస్ట్ అనేది  ఎక్కడా లేదని.. ఇలాంటి కాల్స్ వస్తే ప్రజలు భయపడకుండా పోలీసులకు కాల్ చేయాలని కోరారు.