కేసీఆర్ చేసిన అప్పులతో రాష్ట్రంపై భారం ఉన్నప్పటికీ... సమస్యలు పరిష్కరిస్తాం: మంత్రి వివేక్

కేసీఆర్ చేసిన అప్పులతో రాష్ట్రంపై భారం ఉన్నప్పటికీ... సమస్యలు పరిష్కరిస్తాం: మంత్రి వివేక్

శుక్రవారం ( సెప్టెంబర్ 19 ) హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో జరిగిన దళిత జర్నలిస్టుల ఫోరమ్ రాష్ట్ర మహాసభకు ముఖ్య అతిధిగా హాజరయ్యారు మంత్రి వివేక్ వెంకటస్వామి. ఈ కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా దళిత జర్నలిస్టులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేసారు మంత్రి వివేక్. దళిత సోదరులను కలుసుకోవడం సంతోషంగా ఉందని.. మన హక్కులను దక్కించుకోవాలని అన్నారు మంత్రి వివేక్. కేసీఆర్ చేసిన అప్పులతో రాష్ట్రంపై కొంత ఆర్థిక భారం ఉందని.. కాస్త లేట్ అయినా సమస్యలు పరిష్కరిస్తామని అన్నారు మంత్రి వివేక్.

దళితుల సమస్యలపై అసెంబ్లీలో మీటింగ్ లో కూడా చర్చ జరిగిందని.. 18 శాతం నిధులు బడ్జెట్ లో కేటాయిస్తే దళితుల సమస్యలు తీరతాయని అన్నారు దళిత జరలిస్టుల సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు మంత్రి వివేక్. ఆనాడు మా నాన్న కాకా దళితుల కోసం చాలా చేసాడని.. నేను కూడా దళితుల అభ్యున్నతికీ కట్టుబడి ఉంటానని అన్నారు మంత్రి వివేక్.  

రైతు బంధు పథకం గురించి దళితులు ఎవరికీ సొంత భూమి ఉండదని.. ఎక్కువ కౌలు భూమి ఉంటుందని ఆ రోజే వాళ్ళ నిర్ణయాన్ని వద్దని చెప్పానని అన్నారు. ఎప్పుడూ దళితుల కోసం, దళితులతోనే ఉంటానని.. దళితుల సమస్యల కోసం పని చేస్తానని అన్నారు మంత్రి వివేక్.