
- సమాజంలో ఫొటోగ్రాఫర్లది కీ రోల్
- అసోసియేషన్ భవనం, ఐడీ కార్డులపై సీఎంతో చర్చిస్త
- జీఎస్టీ తగ్గింపు కోసం కేంద్రానికి లేఖ
- మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి
- హైదరాబాద్ ఫొటో ట్రేడ్ ఎక్స్ పో 2025 ప్రారంభం
హైదరాబాద్: రాష్ట్రంలో ఏర్పాటు చేసిన 46 అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ ద్వారా ట్రైనింగ్ కోర్సులు అందుబాటులోకి రాబోతున్నట్లు రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి తెలిపారు. సమాజంలో ఫొటోగ్రాఫర్స్ ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారని చెప్పారు. నార్సింగిలోని ఓం కన్వెన్షన్ హాల్లో తెలంగాణ ఫొటో అండ్ వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వ ర్యంలో మూడు రోజుల పాటు జరగనున్న హైదరాబాద్ ఫొటో ట్రేడ్ ఎక్స్పో 2025ను ఆయన ఇవాళ ప్రారంభించారు.
వివిధ స్టాళ్లను సందర్శించి తాజా పరికరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లా డుతూ.. రాజకీయాలు.. వివాహాలు.. ఇలాఈవెంట్ ఏదైనప్పటికీ ఫొటోగ్రాఫర్, వీడి యోగ్రాఫర్ లేకుండా జరగవన్నారు. ఫొటో గ్రాఫర్స్ అసోసియేషన్ భవనం, ఐడెంటిటీ కార్డులపై సీఎం రేవంత్రెడ్డితో చర్చిస్తానని కోహామీ ఇచ్చారు. ఇన్సూరెన్స్ స్కీమ్ తీసుకురావడానికి కృషి చేస్తానన్నారు. కెమెరాలు, మొబైల్ ఫోన్లపై ప్రస్తుతం ఉన్న జీఎస్టీని 18% నుంచి 5% కి తగ్గించేలా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు లేఖ రాయనున్నట్టు తెలిపారు.
అంబేద్కర్ విద్యాసంస్థల ద్వారా ఉచిత విద్య
కాకా స్థాపించిన అంబేద్కర్ విద్యాసంస్థల ద్వారా 50 ఏండ్లుగా పేద విద్యార్థులకు ఉచిత విద్య అందిస్తున్నట్లు మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. 75% మార్కులు సాధించిన విద్యార్థులకు ఫీజు మాఫీ స్కీమ్ కొనసాగుతోందని చెప్పారు. గత ఏడాది ఇంటర్ పరీక్షల్లో ఆరు రాష్ట్ర ర్యాంకులు సాధించినట్లు గుర్తు చేశారు. పెద్దపల్లిలో ఫొటోగ్రాఫర్స్ కోసం ఎంపీ నిధుల నుంచి రూ.10లక్షల నుంచి రూ.15 లక్షలు విడుదల చేయిస్తానని హామీ ఇచ్చారు.