తాగు నీటిలో సుందెలుక..ఆ వాటర్ తాగడంతో 8 మంది చిన్నారులకు అస్వస్థత

తాగు నీటిలో సుందెలుక..ఆ వాటర్ తాగడంతో 8 మంది చిన్నారులకు అస్వస్థత
  • మెదక్ జిల్లాలోని అంగన్ వాడీ సెంటర్ లో ఘటన 

శివ్వంపేట, వెలుగు: మెదక్ జిల్లాలోని అంగన్ వాడీ సెంటర్ లో తాగు నీటి బిందెలో సుందెలుక పడి  చనిపోగా,  ఆ వాటర్  తాగిన పలువురు చిన్నారులు  అస్వస్థతకు గురయ్యారు. శివ్వంపేట మండలం రత్నాపూర్ అంగన్ వాడీ సెంటర్ లో తాగు నీటి బిందెలో పడిన సుందెలుకను గమనించకుండా  పిల్లలు  మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత తాగారు. కొద్దిసేపటికి 8 మంది  అస్వస్థతకు గురయ్యారు.  

తల్లిదండ్రులు వచ్చి వెంటనే పిల్లలను నర్సాపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 24 గంటలు అబ్జర్వేషన్ లో ఉండాలని డాక్టర్లు తెలిపారు. ఆయా రాజమ్మ రెండు రోజుల కింద తాగు నీటి బిందె తీసుకొచ్చి పెట్టగా..  అందులో సుందెలుక పడి చనిపోగా..  అంగన్ వాడీ టీచర్, ఆయా నిర్లక్ష్యం కారణంగానే పిల్లలు అస్వస్థతకు గురయ్యారని చిన్నారుల తల్లిదండ్రులు ఆరోపించారు. అధికారులు తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.