మూడు సినిమాలతో థియేటర్లు కళకళ

మూడు సినిమాలతో థియేటర్లు కళకళ

బింబిసార, సీతారామం, కార్తికేయ 2 సినిమాలు హిట్ కావడంతోప్రస్తుతం టాలీవుడ్ ఫుల్ జోష్ మీద ఉంది. మంచి వసూళ్లు సాధించిన ఈ మూడు సినిమాలు తెలుగు వారి ఖ్యాతిని మరోసారి చాటాయి. దేశం మొత్తం మాట్లాడుకునేలా చేశాయి. సినిమాకు కంటెంట్ ఎంతో ముఖ్యమో..గట్టిగా తేల్చేశాయి. కళ్యాణ్ రామ్ కెరీర్ లో ‘బింబిసార’ బిగ్ హిట్ కొట్టింది. దుల్కర్ సల్మాన్ నటించిన ‘సీతా రామం’ మంచి విజయాన్ని నమోదు చేసింది. ఇక నిఖిల్ కు ‘కార్తికేయ 2’ హిందీలో కూడా మంచి విజయం నమోదు చేసింది. ఇక ఈ మూడు సినిమాల కథలకు కొన్ని విషయాల్లో పోలికలు ఉండటం విశేషం. ‘బింబిసార’ స్టోరీ ధన్వంతరి గ్రంథం చుట్టూ తిరుగుతుంది. ఈ పుస్తకంలోని సమాచారం తెలుసుకోవటానికి విలన్స్ రంగంలోకి దిగుతారు. చివరికి బింబిసారుడు కూడా ఈ బుక్ లోని విషయంతోని ఔషదం తయరు చేసి ఓ పాపను కాపాడతాడు.

సీతా రామం ఫిల్మ్ విషయానికి వస్తే.. కేవలం ఓ లెటర్ చుట్టూ స్టోరీ నడుస్తుంది. అసలు విషయం తెలియటంతో స్టోరీలో మంచి ట్విస్ట్ వస్తుంది. క్లైమాక్స్ ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. ఇక కృష్ణుని కడియం చుట్టు..‘కార్తికేయ 2’ మూవీ స్టోరీ సాగుతుంది. ముందుతరాలకు అవసరమైన విషయాలు క్లైమాక్స్ లో ఉన్నాయి. నయం కాని జబ్బులకు కూడా పరిష్కారం తెలిపేలా సమాచారం ఉంటుంది. బింబిసార, కార్తికేయ 2, సీతా రామం మూవీలు..అప్పటికే రాసి ఉన్న సమాచారం తెలుసుకోటానికి అన్నట్టుగా స్టోరీలు సాగుతాయి. బింబిసార..స్టోరీ ప్రజెంట్ నుండి..చరిత్రకు కనెక్ట్ అయి ఉంటుంది. సీతా రామం కథ పీరియాడిక్ కు కలిసి ఉంటుంది. ఇక..కార్తికేయ 2 స్టోరీ పౌరాణికంతో మిక్సయి నడుస్తుంది. ఇలా ఈ సినిమాల స్టోరీలు ఇతర కాలాలతో కనెక్ట్ అయి ఉండటం విశేషం. ఇలా ఈ మూడు సినిమాలకు..కొన్ని విషయాలలో పోలిక ఉండడం గమనార్హం. మొత్తంగా ఈ మూడు సినిమాలు థియేటర్లను కళ కళ లాడేలా చేశాయి.