
కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని దివంగత బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్యనందింత సోదరి నివేదిత తెలిపారు. మార్చి 16వ తేదీ అభిమానులు, కార్యకర్తల సమావేశం తరువాత ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె ఈ విషయాన్ని వెల్లడించారు. తన తండ్రిని, సోదరిని గెలిపించినట్లే తనని కూడా ఆశీర్వదించాలని కోరారు.
ఇదే విషయంపై కేసీఆర్ ను కలిసి త్వరలో దీనిపై మాట్లాడుతానని చెప్పారు. కాగా, ఫిబ్రవరి 23న హైదరాబాద్‌లోని అవుటర్ రింగు రోడ్డు(ఓఆర్‌ఆర్) పై జరిగిన రోడ్డు ప్రమాదంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో లోక్ సభ ఎన్నికలతో పాటుగా కంటోన్మెంట్ కు ఈసీ ఉప ఎన్నిక నిర్వహించనుంది. బీఆర్ఎస్ నివేదితకి టికెట్ ఇస్తుందా లేదా అన్నది చూడాలి.