వాగులో మునిగి కాంట్రాక్ట్ ఉద్యోగి మృతి.. గణేశ్ నిమజ్జనం చేసేందుకు వెళ్లగా విషాదం

వాగులో మునిగి కాంట్రాక్ట్ ఉద్యోగి మృతి.. గణేశ్ నిమజ్జనం చేసేందుకు వెళ్లగా విషాదం
  • భద్రాద్రి జిల్లాలోని మల్లన్నవాగులో ప్రమాదం

గుండాల, వెలుగు: గణేశ్ నిమజ్జనానికి వెళ్లి వాగులో మునిగి కాంట్రాక్ట్ ఉద్యోగి మృతిచెందిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగింది. గుండాల టీటీడబ్ల్యూఆర్ స్కూల్ లో గణపతి విగ్రహం ఏర్పాటు చేసి శనివారం నిమజ్జనానికి విగ్రహాన్ని మల్లన్న వాగుకు తీసుకెళ్లారు. స్కూల్ కు చెందిన కాంట్రాక్టు ఉద్యోగి బానోత్ మోహన్ (28), మరో టీచర్ బోడ సురేశ్ తో కలిసి వాగులో స్నానానికి దిగారు. మోహన్ నీటిలో మునిగిపోయి ఎంతకూ తేలలేదు. దీతో ప్రిన్సిపాల్ కు టీచర్ సురేశ్ సమాచారం అందించారు.

ప్రిన్సిపాల్, టీచర్లతో పాటు కొందరు విద్యార్థులు వెళ్లి వాగులో గాలించగా మోహన్ డెడ్ బాడీ దొరికింది. మృతుడి కుటుంబ సభ్యులకు తెలియడంతో స్కూల్ వద్దకు వెళ్లారు. మోహన్ డెడ్ బాడీని స్కూలు వద్దకు తీసుకొచ్చి సిబ్బంది పట్టించుకోవడం లేదని బాధిత కుటుంబం మండిపడింది. డెడ్ బాడీతో బైఠాయించి ధర్నాకు దిగారు. మృతుడి కుటుంబానికి రూ. నష్టపరిహారంతో పాటు ఒకరికి జాబ్ ఇవ్వాలని పలు పార్టీలు, సంఘాల నేతలు డిమాండ్ చేశారు. మృతుడి భార్య విజయ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ సయ్యద్ రవూఫ్ తెలిపారు.