ఎన్నో ట్విస్టులు, సస్పెన్స్ ల తర్వాత తమిళనాడులో టీవీకే విజయ్ ఆధ్వర్యంలో ప్రభుత్వం కొలువుదీరింది. ముఖ్యమంత్రిగా 2026 మే 10న టీవీకే విజయ్ ప్రమాణ స్వీకారం చేశారు. అన్నీ సర్దుకున్నాయిలే అనుకునే లోపే మరో కొత్త వివాదం తమిళనాట మొదలైంది. ఇప్పుడు అక్కడ రాష్ట్ర గీతానికి అవమానం జరిగిందనే దుమారం రాజుకుంటోంది.
తమిళనాడు సీఎంగా టీవీకే విజయ్ ప్రమాణ స్వీకారం సందర్భంగా రాష్ట్ర గీతానికి అవమానం జరిగిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఎం.వీరపాండియన్ ఆరోపించారు. తమిళ్ తాయి వాళ్తూ.. అనే రాష్ట్ర గీతం విషయంలో ప్రోటోకాల్ మరిచి అవమానించారని సీఎం విజయ్ కు లేఖ రాశారు.
ప్రమాణ స్వీకారం సందర్భంగా ముందుగా వందేమాతరం , ఆ తర్వాత జనగమణ పాడిన తర్వాత రాష్ట్రగీతం తమిళ్ తాయి వాళ్తూ పాడినట్లు ఆరోపించారు. కానీ ప్రోటోకాల్ ప్రకారం మొదట రాష్ట్రగీతం, ఆ తర్వాత జనగమణ పాడాల్సి ఉందని లేఖలో పేర్కొన్నారు. సంప్రదాయంగా దశబ్దాలుగా వస్తున్న సంప్రదాయాన్ని, ప్రోటాకల్ లను ఉల్లంఘించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
►ALSO READ | స్టాలిన్ లేని అసెంబ్లీకి సీఎం విజయ్.. ఇక అంతా ఉదయనిధి చేతుల్లోనే.. !
రాజ్ భవన్ నింధనల ప్రకారం ముందుగా వందేమాతరం, చివరల్లో రాష్ట్ర గీతం పాడటం ద్వారా ఎన్నో ఏళ్లుగా వస్తున్న సంప్రదాయాన్ని తుంగలో తొక్కారని.. ఈ వ్యవహారంలో ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా భవిష్యత్తులో ఇలాంటి పొరాపట్లు పునరావృతం కాకుండా .. రాష్ట్ర గీతానికి తగిన గౌరవం ఇస్తామని తమిళగ వెట్రి కజగమ్ హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఇక నుంచి ఏ కార్యక్రమం అయినా తమిళ్ తాయి వాళ్తు ముందుగా ఆలపిస్తామని సీఎం విజయ్, ప్రొటెమ్ స్పీకర్ హామీ ఇవ్వాలని డిమాండ్ చేవారు. రేపు (2026 మే 11) అసెంబ్లీ సమావేశం ఉండటంతో.. అసెంబ్లీలో ముందుగా రాష్ట్ర గీతం పాడి.. ఆ తర్వాత జనగణమనతో ఎండ్ చేయాలని డిమాండ్ చేశారు.
