ఓయూలో  కన్వీనర్ కోటా సీట్లు అమ్ముకుంటున్రు

ఓయూలో  కన్వీనర్ కోటా సీట్లు అమ్ముకుంటున్రు
  • వర్సిటీలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆందోళన


సికింద్రాబాద్, వెలుగు:  ఓయూ పీజీ, లా, ఎడ్ సెట్​లో  కన్వీనర్ సీట్లను  అధికారులు మేనేజ్ మెంట్ కోటాలో అమ్ము కుంటున్నారని ఎస్ఎఫ్ఐ  నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఓయూలోని అడ్మినిష్ట్రేటివ్​ బిల్డింగ్​ ఎదుట  సోమవారం ఆందోళన చేశారు. ఈ సందర్బంగా ఎస్ఎఫ్ఐ ఓయూ సెక్రటరీ రవి నాయక్ మాట్లాడుతూ..  యూనివర్సిటీతో పాటు  టాప్ టెన్ ఓయూ అనుబంధ కాలేజీల్లో  మిగిలిన సీట్లకు  కౌన్సిలింగ్ నిర్వహించకుండా ఆ సీట్లను స్పాట్ అడ్మిషన్ పేరుతో  అమ్ముకుంటున్నారని అయన మండి పడ్డారు.  దీని వల్ల  పేద స్టూడెంట్లు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.  యునివర్సిటీ వీసీ స్పందించి  చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న స్టూడెంట్లపై  వర్సిటీ సెక్యూరిటీ సిబ్బంది పిడుగుద్దలతో దాడి చేశారన్నారు. ఆందోళన చేస్తున్న ఎస్ఎఫ్ఐ నాయకులను  ఓయూ పోలీసులు అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు.  అరెస్టయిన వారిలో  నాయకులు విజయ్ నాయక్, సతీష్ శంకర్, హరీష్, శ్రీను, అఖిల్, రమేష్ ఉన్నారు.

మరిన్ని వార్తల కోసం:

వైరల్ అవుతున్న ‘శ్రీవల్లి’ ఇంగ్లిష్ వెర్షన్

జేఎన్‌యూ వీసీగా తెలుగు మహిళ