చెరువులను రిజర్వాయర్లుగా మారుస్తున్నం : మంత్రి నిరంజన్‌‌‌‌‌‌‌‌ రెడ్డి

చెరువులను రిజర్వాయర్లుగా మారుస్తున్నం : మంత్రి నిరంజన్‌‌‌‌‌‌‌‌ రెడ్డి
  • స్టూడెంట్లకు క్వాలిటీ ఎడ్యుకేషన్‌‌‌‌‌‌‌‌ అందిస్తున్నం

శ్రీరంగాపూర్​, వెలుగు: ప్రాజెక్టుల నిర్మాణంతో పాటు చెరువులను రిజర్వాయర్లుగా మార్చి ఇరిగేషన్‌‌‌‌‌‌‌‌, టూరిజం రంగాలను అభివృద్ధి చేస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌‌‌‌‌‌‌‌ రెడ్డి చెప్పారు.  వనపర్తి జిల్లా శ్రీరంగాపురం మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీరంగనాథ ఆయల పరిధిలోని రిజర్వాయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో టూరిజం లాంచిని ప్రారంభించారు.  అంతకుముందు మండల కేంద్రంలో రూ.3 .35 కోట్లతో నిర్మించిన కస్తూర్భా గాంధీ విద్యాలయం,  రూ.40 లక్షలతో నిర్మించిన సింగిల్​ విండ గోదాం,  రూ.31లక్షలతో నిర్మించిన ఎమ్మార్సీ భవనాన్ని ఓపెన్ చేశారు.  అనంతరం  ఖిల్లాఘణపురం మండలం ఆగారంలో జీపీ భవవాన్ని ఓపెన్ చేయడంతో పాటు  సబ్‌‌‌‌‌‌‌‌ హెల్త్‌‌‌‌‌‌‌‌ సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆయా కార్యక్రమాల్లో మంత్రి మాట్లాడుతూ  దేశంలో వ్యవసాయ, సాగునీటి రంగాలకు పెద్దపీట వేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణే అన్నారు.   ఒకప్పుడు చదువుకునేందుకు సరిగ్గా తరగతి గదులు కూడా ఉండేవి కావని,  ప్రస్తుతం సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆధ్వర్యంలో  కార్పొరేట్‌‌‌‌‌‌‌‌ విద్యాసంస్థలకు దీటుగా కేజీ టూ పీజీ వరకు నాణ్యమైన విద్య అందిస్తున్నామని చెప్పారు. కేజీబీవీలో స్టూడెంట్లకు పలు ప్రశ్నలు వేసి.. సమాధానం  చెప్పిన వారికి  నగదు బహుమతులు అందజేశారు.  సర్పంచ్​ వినీల, ఎంపీపీ గాయత్రి, పీఏసీఎస్‌‌‌‌‌‌‌‌ చైర్మన్​ జగనాథం నాయుడు, వైస్​ ఎంపీపీ మహేశ్వర్​ రెడ్డి, డీఈవో రవీందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఎంఈవో  జయరాములు, ప్రిన్సిపల్​వాణి, ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.  

పశువైద్య శిబిరాలు వినియోగించుకోవాలి 

పెబ్బేరు, వెలుగు :  పశువైద్య శిబిరాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌‌‌‌‌‌‌‌ రెడ్డి సూచించారు. పీవీ నరసింహారావు పశువైద్య విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో జాతీయ సేవా పథకం ద్వారా నిర్వహిస్తున్న  ప్రత్యేక పశువైద్య శిబిరాలను బుధవారం పెబ్బేరు వ్యవసాయ మార్కెట్‌‌‌‌‌‌‌‌లో కలెక్టర్​ షేక్​ యాస్మిన్​ బాషాతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతులు తమ పశువులకు శిబిరాల్లో వైద్యం చేయించుకోవాలని  కోరారు. ఈ  కార్యక్రమంలో  వర్సిటీ వైస్ ఛాన్సలర్  రవీందర్ రెడ్డి, మున్సిపల్​ చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పర్సన్​ కరుణశ్రీ, ఎంపీపీ శైలజ, మాజీ మార్కెట్​ ఛైర్మన్​ బుచ్చారెడ్డి, బీఆర్​ఎస్​ నాయకులు సాయినాథ్​, దిలీప్​ కుమార్​ రెడ్డి, విశ్వరూపం, రామకృష్ణ  పాల్గొన్నారు.