
ఓ మూవీ పంక్షన్ కు చీఫ్ గెస్టుగా వచ్చిన నటుడు యాంకర్ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ ఘటన చెన్నైలో చోటుచేసుకోగా దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. యూట్యూబర్‌గా కెరీర్ మొదలుపెట్టి తక్కువ టైమ్ లో నటుడిగా పేరు సంపాదించుకున్నారు కూల్ సురేశ్. పలు సినిమాల్లో కమెడియన్‌గా నటిస్తూ ఫేమ్ అయ్యాడు.
అయితే తాజాగా మన్సూర్ అలీ ఖాన్ తెరకెక్కించిన సరక్ సినిమా ప్రమోషన్‌కు సురేశ్ చీఫ్ గెస్టుగా వచ్చాడు. అక్కడ మాట్లాడుతూ ఒక్కసారిగా పక్కనే ఉన్న యాంకర్ మెడలో పూలమాల వేశాడు. దీంతో షాకైన సదరు యాంకర్.. పూల మాల తీసి కింద పడేసి కన్నీళ్లు పెట్టుకుంది. యాంకర్ ఇబ్బందిని అర్థం చేసుకున్న మన్సూర్ అలీఖాన్.. ఆమెకు అందరి ముందు క్షమాపణలు చెప్పాడు.
For the kind attention of Tamil Film Producers, Directors, Artistes & PRO's:
— Ottran Dorai (@ottrandorai) September 20, 2023
The activity of junior artiste #CoolSuresh is becoming worse day-by-day. Yesterday during the audio launch of #MansoorAliKhan #Saraku movie,@chennaipolice_ @tnpoliceoffl @MuraliRamasamy4 @Udhaystalin pic.twitter.com/b5kcaX1MUL
అంతేకాకుండా కూల్ సురేశ్ ను కూడా క్షమాపణలు చెప్పాలని అడిగాడు.. అనంతరం యాంకర్‌కు సారీ చెప్పిన సురేశ్.. ప్రమోషన్ కోసమే తాను ఈ పని చేశానని చెప్పాడు. అయితే కూల్ సురేష్ పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. గాయని చిన్మయి తదితరులు సురేష్‌పై మండిపడుతున్నారు. కాగా మన్సూర్ అలీఖాన్ సరకు చిత్రాన్ని నిర్మించి, నటించారు. ఈ చిత్రానికి జయకుమార్.జె. అరుల్ విన్సెంట్, మహేష్. డి సినిమాటోగ్రఫీ అందిచగా సిద్ధార్థ్ విపిన్ సంగీతం అందించారు.