హైదరాబాద్ లో కూల్ వెదర్..పలు చోట్ల చిరుజల్లులు

హైదరాబాద్ లో కూల్ వెదర్..పలు చోట్ల చిరుజల్లులు

హైదరాబాద్ లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. పూర్తిగా చల్లబడి పోయింది. ఏప్రిల్ 12వ తేది  రాత్రి నుంచి పలు చోట్ల  చిరుజల్లు పడుతున్నాయి.హైటెక్ సిటీ, మాదాపూర్,కొండాపూర్, గచ్చిబౌలి, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్,  పంజాగుట్ట,అమీర్ పేట ,ఖైరతాబాద్,  కూకట్ పల్లి, పఠాన్ చెరు, మియాపూర్, సికింద్రాబాద్, జేబీఎస్, అల్వాల్,  మేడ్చల్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో చిరుజల్లులు పడుతున్నాయి. 

అటు దిల్ సుఖ్ నగర్, ఉప్పల్, ఎల్బీనగర్ లో ను అక్కడక్కడ చిరుజల్లులు పడుతున్నాయి.  మరో మూడు, నాలుగు రోజులు ఇలాంటి కూల్ వెదర్ హైదరాబాద్ సిటీలో ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. 

అటు జిల్లాలోనూ పలు చోట్ల తేలికపాటి వర్షాలు పడుతున్నాయి. నిజామాబాద్ జిల్లాలోని  పలు చోట్ల  తేలికపాటి వర్షం పడుతోంది. నిర్మల్ జిల్లా  ముధోల్ నియోజకవర్గంలోని పలు మండలాలలో  వర్షం కురుస్తోంది. కామారెడ్డి జిల్లాలో రాత్రి నుంచి మోస్తరుగా వర్షం పడుతోంది.  జుక్కల్  నియోజక వర్గంలో తెలవారు నుంచి చిరు జల్లులు పడుతున్నాయి. 

ఏప్రిల్ 14న తెలంగాణలోని ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ ఐఎండీ తెలిపింది.