కూకట్‌పల్లి సీఐ లక్ష్మినారాయణరెడ్డిని హిమాచల్ ప్రదేశ్ సీఎం జైరామ్ ఠాకూర్ ప్రశంసించారు. హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన లలిత్ కుమార్ అనే వ్యక్తి తీవ్ర అనారోగ్యానికి గురై.. లాక్ డౌన్ కారణంగా కూకట్‌పల్లిలో చిక్కుకపోయాడు. దీంతో అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు ఎవరు ముందుకు రాలేదు. పైగా అతని వద్ద వైద్యానికి డబ్బు కూడా లేదు. దీనిపై సమాచారం అందుకున్న కూకట్‌పల్లి పోలీసులు అతన్ని ఆస్పత్రికి తరలించారు. బాధితుడికి అత్యవసరంగా శస్త్రచికిత్స చేయాల్సి రావడంతో అందుకు కావల్సిన 20వేల రూపాయలను సిఐ లక్ష్మినారాయణ రెడ్డి ఆసుపత్రిలో చెల్లించారు. ఈ విషయం తెలుసుకున్న హిమాచల్‌ప్రదేశ్ సీఎం జైరామ్ ఠాకూర్ కూకట్‌పల్లి సీఐని ప్రశంసించారు. కోవిడ్ 19 పై పోరాటం చేస్తూ, అవసరమైన వారికి అండగా నిలిచే మీ వ్యక్తిత్వం పలువురికి ఆదర్శనీయమని ఆయన కొనియాడారు.

